దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శిద్ధా సుధీర్ బాబు

  • Published By: veegamteam ,Published On : March 16, 2019 / 03:03 PM IST
దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శిద్ధా సుధీర్ బాబు

Updated On : March 16, 2019 / 3:03 PM IST

ప్రకాశం : దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శిద్ధా సుధీర్ బాబును టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఫైనల్ చేశారు. తిరుపతిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పేరును ప్రకటించారు. మొదటి జాబితాలో పేరు లేకున్నా… రెండో జాబితాలో కుమారుడు సుధీర్ బాబుకు టికెట్ దక్కేలా మంత్రి శిద్ధా రాఘవరావు చక్రం తిప్పారని తెలుస్తోంది. మరోవైపు మాగుంట శ్రీనివాస్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పడంతో ఒంగోలు ఎంపీ అభ్యర్థికి మంత్రి శిద్ధా రాఘవరావు పేరును ఖరారు చేశారు. బాలకృష్ణ సహకారంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు  తన సీటుకు ముప్పు రాకుండా వ్యవహరించారు.