Karnataka Politics: సిద్ధరామయ్య భయపడ్డారు, నేనలా కాదు.. డిప్యూటీ సీఎం డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

Karnataka Politics: సిద్ధరామయ్య భయపడ్డారు, నేనలా కాదు.. డిప్యూటీ సీఎం డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

Updated On : June 28, 2023 / 4:37 PM IST

DK and Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక సందర్భంలో భయపడ్డారని, తానైతే అలా భయపడేవాడిని కాదంటూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. 2017లో కాంగ్రెస్ హయాంలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రజా వ్యతిరేకత వచ్చి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తాజాగా బెంగళూరు నగరంలో టెన్నెల్స్, ఫ్లైఓవర్స్ నిర్మాణానికి సంబంధించిన అభ్యర్థనలు చాలా వస్తున్న నేపథ్యంలో పాత ప్రాజెక్ట్ విషయాన్ని ప్రస్తావిస్తూ డీకే ఈ వ్యాఖ్యలు చేశారు.

Ravi Kishan Daughter: అగ్నిపథ్ పథకం కింద డిఫెన్స్ ఫోర్స్‌లో చేరిన బీజేపీ ఎంపీ కుమార్తె ఇషితా శుక్లా

డీకే శివకుమార్ స్పందిస్తూ ‘‘టన్నెల్స్, ఫ్లైఓవర్స్ నిర్మించాలని ఇటీవల చాలా మంది నుంచి అనేక అభ్యర్థనలు వస్తున్నాయి. అయితే మహా నగరంలో అలాంటి ప్రాజెక్టులు నిర్మించడం అంత సులువైన పని కాదు. అనేక సవాళ్లు ఎదురవుతాయి. 2017లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే బెంగళూరు నగరంలో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయించింది. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సీఎం సిద్ధరామయ్య, బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కేజే జార్జ్ భయపడ్డారు. అదే నేనైతే నిరసనలకు తలొగ్గేవాడిని కాదు. ప్రాజెక్ట్ నిర్మాణంవైపే ముందుకేళ్లేవాడిని’’ అని అన్నారు.

Eatala Rajender: అక్కడి నుంచే నా హత్యకు కుట్రలు జరుగుతున్నాయి.. వాళ్లే నాకు చెప్పారు: ఈటల

పాత జ్ణాపకాన్ని చెప్పడం బాగానే ఉన్నప్పటికీ.. సిద్ధరామయ్య భయపడ్డారని, తాను భయపడనంటూ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తున్నాయి. సొంత ప్రభుత్వ నేతలు సైతం ఈ వ్యాఖ్యలను తప్పు పడుడుతున్నారు. సిద్ధరామయ్య భయపడలేదని, ప్రజల అభిప్రాయాలతో ఏకీభవించారని, ప్రజలతో సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుందని మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. కొన్నిసార్లు తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చి మంచి నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం అవుతుందని, బహుశా డీకే ఆ ఉద్దేశంతోనే చెప్పి ఉంటారని ఖర్గే అన్నారు.