Pawan Kalyan : కాపులు ఎటువైపు? 24 సీట్లు తీసుకున్న పవన్ కల్యాణ్‌పై విమర్శలు ఎందుకు?

టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై కాపు నేతలకు, వైసీపీకి ఉన్న అభ్యంతరాలు ఏంటి?

Pawan Kalyan : కాపులు ఎటువైపు? 24 సీట్లు తీసుకున్న పవన్ కల్యాణ్‌పై విమర్శలు ఎందుకు?

Kapu Leaders Angry On Pawan Kalyan

Pawan Kalyan : ఏపీలో కాపు రాజకీయం కాక పుట్టిస్తోంది. టీడీపీ-జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటుపై మొదలైన లొల్లి ఇంకా చల్లబడలేదు. రాష్ట్రంలో ప్రధాన సామాజికవర్గానికి తగిన న్యాయం జరగలేదని, పొత్తు ధర్మం విస్మరించారని కూటమిపైన మరీ ముఖ్యంగా ప్రధానమైన జనసేనాని పవన్ కల్యాణ్ పై విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. వీరికి కాపు నేతలు తోడు కావడంతో రాష్ట్రంలో రాజకీయం హాట్ హాట్ గా మారింది.

80 సీట్లు, రెండేళ్లు సీఎం పదవి అడుగుతారని భావిస్తే.. పవన్ 24 సీట్లతో సరిపెట్టుకున్నారని కాపు ఉద్యమ నేతలు లేఖలు రాయడం, ఇక కాపు నేతలతో పవన్ కు పని లేదన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై కాపు నేతలకు, వైసీపీకి ఉన్న అభ్యంతరాలు ఏంటి? 24 సీట్లు తీసుకున్న జనసేనపై విమర్శలు ఎందుకు? కాపులు ఎటువైపు.. ప్రైమ్ టైమ్ డిబేట్..

Also Read : కాపు నేతలు హర్ట్ అయ్యారా? పవన్ కల్యాణ్‌తో కటీఫేనా?

పూర్తి వివరాలు..