టి.కేబినెట్ విశేషాలు : రోగులకు వైద్య పరీక్షలు ఫ్రీ

  • Published By: madhu ,Published On : February 16, 2020 / 05:05 PM IST
టి.కేబినెట్ విశేషాలు : రోగులకు వైద్య పరీక్షలు ఫ్రీ

Updated On : February 16, 2020 / 5:05 PM IST

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా జరుగుతోంది. 2020, ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఆరు గంటలుగా కొనసాగుతోంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌పై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఇకపై రోగులకు వైద్య పరీక్షలు ఫ్రీగా నిర్వహించాలని నిర్ణయించారు.

దీర్ఘకాలిక రోగాల బారిన పడిన వారికి ప్రభుత్వ పించన్‌ అందించనున్నారు. అలాగే ఈనెల 28న శంషాబాద్‌లో రెవెన్యూ సమ్మేళనం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. రెవెన్యూ చట్ట అవగాహన, భూ సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో భూముల అమ్మకాలకు లైన్‌క్లియర్ ఇచ్చింది. రూ.10వేల కోట్ల ఆదాయాన్ని భూముల అమ్మకాల ద్వారా రాబట్టాలని కేబినెట్ అంచనా వేస్తోంది. ఉప్పల్ బగాయత్ తరహాలో ల్యాండ్ పూలింగ్‌పై కేబినెట్‌ చర్చ జరుపుతోంది. ఆ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 

Read More : చెప్పిన ప్రతి పని చేస్తాం..ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం – పవన్