ఆ మహిళా మంత్రి పబ్బుల్లో గంతులు వేస్తారు, పదవులు అమ్ముకున్నారు- రోజాపై చంద్రబాబు ఫైర్

నగరికి నలుగురు ఎమ్మెల్యేలు. వాటాలు వేసుకుని దోచుకుంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు. దొంగ ఓట్లు సృష్టించి, ఎర్రచందనం బాగా రవాణ చేస్తాడు కాబట్టి ఒంగోలుకు ప్రమోషన్ ఇచ్చారు.

ఆ మహిళా మంత్రి పబ్బుల్లో గంతులు వేస్తారు, పదవులు అమ్ముకున్నారు- రోజాపై చంద్రబాబు ఫైర్

Chandrababu Naidu Slams Minister Roja

Updated On : February 6, 2024 / 6:51 PM IST

Chandrababu Naidu : ఏపీ మంత్రి రోజాపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రోజా టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. పక్క రాష్ట్రాలకు వెళ్లి పబ్బుల్లో గంతులు వేస్తున్నారు. మంత్రి పదవులు అమ్ముకున్నారు. ఆ మంత్రికి హుందాతనమే లేదు అంటూ విరుచుకుపడ్డారు చంద్రబాబు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడారు.

”సీఎం జగన్ దళిత ద్రోహి. ఇక్కడున్న మూడు ఎస్సీ నియోజకవర్గాల అభ్యర్థులను వైసీపీ మార్చింది. ఇక్కడ నారాయణ స్వామి రెడ్లకు జీహుజూర్ అంటూ జీవిస్తున్నారు. ఓ పెద్ద శాఖను నారాయణ స్వామికి ఇచ్చారు. అయినా ఆయనో గుమస్తా. లెక్కలు వాళ్ళు తీసుకుంటారు. వైసీపీకి అభ్యర్థులు లేరు. ఈ ఊరిలో పనికిరాని వ్యక్తి, మరో ఊరిలో ఎలా పనికొస్తాడు? స్కూటర్ లో తిరిగే పెద్దిరెడ్డికి 35వేల కోట్లు ఎలా వచ్చాయని ఆదిమూలం అడుగుతున్నారు.

Also Read : జాగ్రత్త.. జగన్‌ని నమ్ముకుంటే మీరు జైలుకే- వాలంటీర్లకు చంద్రబాబు హెచ్చరిక

ఆమె ఓ మహిళా మంత్రి. వేరే రాష్ట్రాలకు వెళ్లి పబ్బుల్లో గంతులు వేస్తున్నారు. మంత్రిగా ఆమెకు హుందాతనం లేదు. ఆ మహిళా మంత్రి పదవులు అమ్ముకున్నారు. నగరికి నలుగురు ఎమ్మెల్యేలు. వాటాలు వేసుకుని దోచుకుంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు. దొంగ ఓట్లు సృష్టించి, ఎర్రచందనం బాగా రవాణ చేస్తాడు కాబట్టి ఒంగోలుకు ప్రమోషన్ ఇచ్చారు.

చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు చీటీ చింపేశారు. ఇక్కడ ఒక అంతర్జాతీయ స్మగ్లర్ ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. మొత్తం జిల్లా పార్టీని ఈ ఎమ్మెల్యే రన్ చేస్తున్నారు. టీడీపీ-జనసేన గాలి ఉధృతంగా వీస్తోంది. ప్రభజనంలా మారింది” అని చంద్రబాబు అన్నారు.

Also Read : టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లే?