టీడీపీలో ఫస్ట్ లిస్ట్ మంటలు.. అసంతృప్తులను బుజ్జగిస్తున్న చంద్రబాబు

తెనాలి టీడీపీ ఇంఛార్జి ఆలపాటి రాజాని తన నివాసానికి పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడుతున్నారు.

టీడీపీలో ఫస్ట్ లిస్ట్ మంటలు.. అసంతృప్తులను బుజ్జగిస్తున్న చంద్రబాబు

Chandrababu Convincing TDP Leaders

Chandrababu Naidu : టీడీపీలో ఫస్ట్ లిస్ట్ అసంతృప్తి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జనసేనతో పొత్తులో భాగంగా కొందరు టీడీపీ నేతలకు టికెట్లు గల్లంతయ్యాయి. దీంతో వారంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వారందరితో చంద్రబాబు మాట్లాడుతున్నారు. వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తెనాలి టీడీపీ ఇంఛార్జి ఆలపాటి రాజాని తన నివాసానికి పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడుతున్నారు. రేపు పార్థసారథితో చంద్రబాబు మాట్లాడనున్నారు.

పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు కేటాయించారు చంద్రబాబు. దాంతో అసంతృప్తికి గురైన తెనాలి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి ఆలపాటి రాజాని తన నివాసానికి పిలిపించి మాట్లాడారు చంద్రబాబు.

టీడీపీ ఫస్ట్ లిస్ట్ విడుదల అయ్యాక.. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. జనసేనతో పొత్తులో భాగంగా తమ టికెట్లు గల్లంతు కావడాన్ని కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దాంతో పార్టీ అధినేత చంద్రబాబు అలర్ట్ అయ్యారు. పార్టీలోని అసంతృప్తులను చల్లార్చే పనిలో పడ్డారు. నిన్న మొదటి జాబితా విడుదలైంది. అయితే చాలామంది సీనియర్లకు జాబితాలో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి అనుచరులు కూడా రోడ్డెక్కారు. కొన్ని చోట్ల చంద్రబా, లోకేశ్ ఫ్లెక్సీలను చించేశారు. తమ నేతకు ఎందుకు అన్యాయం చేశారు? ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఎందుకు మొదటి జాబితాలో చోటు దక్కలేదు? అనే ఆందోళన కనిపిస్తోంది.

టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా తెనాలి అసెంబ్లీ సీటు ఆశించారు. అయితే పొత్తులో భాగంగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కు తెనాలి టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో రాజాని తన ఇంటికి పిలిపించుకున్నారు చంద్రబాబు. ఆయనతో మాట్లాడుతున్నారు. ఆలపాటి రాజా భవిష్యత్తుకు భరోసా కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆలపాటి రాజా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి. నాలుగున్నరేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేశాను, తనకు సీటు ఏ విధంగా ఇవ్వరు అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..

జనసేనకు సీటు ఇవ్వడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. తన పేరు, నాదెండ్ల మనోహర్ పేర్లతో సర్వేలు నిర్వహించాలని, ఆ సర్వేలో ఎవరికి ఎక్కువ ప్రజాభిప్రాయం ఉంటే వారికే టికెట్ ఇవ్వాలని ఆలపాటి రాజా వాదిస్తున్నారు. చంద్రబాబు ముందు కూడా ఆయన ఇదే వాదనను వినిపించినట్లు సమాచారం. విశాఖ ప్రయోజనాల దృష్ట్యా పొత్తులో భాగంగా టీడీపీ-జనసేన ముందుకెళ్తున్నాయని.. నాదెండ్ల మనోహర్ జనసేన పీఏసీ ఛైర్మన్ కాబట్టి సీటు ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు నివాసానికి గంటా
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా చంద్రబాబును కలిశారు. ఫస్ట్ లిస్టులో తన పేరు లేకపోవడంతో చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. చీపురుపల్లి నుంచి గంటాను పోటీకి దింపాలని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. తనకు భీమిలి సీటు కావాలని గంటా అడుగున్నారు. ప్రత్యామ్నాయంగా మాడుగుల, చోడవరం సెగ్మెంట్లకు గంటా పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం.