Budda Venkanna : చంద్రబాబు కనుసైగ చేస్తే ఏమైపోతారో- కొడాలి నానికి బుద్ధా వెంకన్న వార్నింగ్

Budda Venkanna : బీసీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు. నీ అంతు చూస్తాం. వరుసగా వైసీపీ నాయకుల ఒక్కొక్కరి జాతకాలు బయటపెడతా.

Budda Venkanna : చంద్రబాబు కనుసైగ చేస్తే ఏమైపోతారో- కొడాలి నానికి బుద్ధా వెంకన్న వార్నింగ్

Updated On : May 29, 2023 / 6:29 PM IST

Budda Venkanna – Kodali Nani : మహానాడులో టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా బదులిచ్చారు. కొడాలి నానికి పిచ్చి పట్టింది. పిచ్చికుక్కలా వ్యవహరిస్తున్నాడు. కొడాలి నాని 420 అంటూ బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు. కొడాలి నాని.. చంద్రబాబు, లోకేశ్ ను ఏమీ చేయలేరు అని అన్నారు.

లోకేశ్.. రాయలసీమలో సింహం లాగా పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. మీడియా సమావేశంలో ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు లాగుతున్నారు, కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ను తిడుతున్నారు అని అన్నారు. ఉమ్మడి జిల్లా లో ‌16 స్థానాలు ఉన్నాయి. మాట్లాడితే మాపై గెలవమంటున్నారు. మరి మిగిలిన వారు తేడా అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.

Also Read..Ambati Rambabu : టీడీపీకి ఇదే చివరి మహానాడు, మళ్లీ వచ్చేది వైసీపీనే- మంత్రి అంబటి రాంబాబు

”మహానాడులో మా పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీసీలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నువ్వు ఎవడు? బీసీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు. నీ అంతు చూస్తాం. నీ ప్రభుత్వం వచ్చాక బీసీలపై అనేక రకాల కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడుపై దారుణమైన కేసులు పెట్టారు.

లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న చంద్రబాబు కనుసైగ చేస్తే మీరు ఏమైపోతారో? కొడాలి నాని బీసీలకు క్షమాపణ చెప్పాలి. కొడాలి నాని ఉల్లిపాయ పకోడివి. కొడాలి నాని నిన్ను ఏడిపించడానికి మాకు ఎంత సమయం పడుతుంది? చంద్రబాబును, చంద్రబాబు కుటుంబాన్ని అన్నవారు బంగాళాఖాతంలో కలిసిపోయారు. చంద్రబాబు ఇంటి మీదకు గొడవకు వెళ్ళిన తర్వాత జోగి రమేశ్ కు మంత్రి పదవి ఇచ్చారు. వరుసగా వైసీపీ నాయకుల ఒక్కొక్కరి జాతకాలు బయటపెడతా” అని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.

Also Read..Bonda uma : టీడీపీ మ్యానిఫెస్టోతో వైసీపీ పునాదులు కదులుతున్నాయి.. అందుకే భయపడుతున్నారు : బోండా ఉమ