త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిపోతుంది: లోకేష్ జోస్యం

త్వరలోనే ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ జోస్యం చెప్పారు. వైసీపీ పాలనపై పలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చి, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా 10tv ఆయనతో ముచ్చటించింది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉచిత ఇసుక విధానం అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం వైసీపీ పాలనలో భారీగా ఇసుక ధర పెరిగిపోయిందని..ఎవరు దోచేస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. ఐదుగురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, ఓ వ్యక్తి వీడియో రికార్డింగ్ చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడని గుర్తు చేశారు లోకేష్. ఆరు నెలల కాలంలో మంచి పేరు తెచ్చుకుంటానని..చెప్పిన జగన్..కేవలం ఐదు నెలల్లోనే ఏపీని ముంచేసే పరిస్థితి తీసుకొచ్చారని.., ఏపీలో వైసీపీ పాలన చూస్తుంటే..రివర్స్ గేర్‌లా ఉందని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న సమస్యలపై టీడీపీ ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదు..కేవలం భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా తాను దీక్ష చేస్తున్నట్లు వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సంక్షేమ కార్యక్రమాలు ఏవీ అమలు కావడం లేదని, రాజకీయం శాశ్వతం కాదని..ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేయాలని నారా లోకేష్.
Read More : నారా లోకేష్ ఇసుక దీక్ష