పవన్ కల్యాణ్ అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ హాట్ కామెంట్స్

పవన్ కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది. ప్రకటించారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారు. జనసేన ప్రకటించిన సీట్ల విషయంలో..

పవన్ కల్యాణ్ అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ హాట్ కామెంట్స్

TDP Reaction On Pawan Kalyan Comments (Photo : Google)

Updated On : January 26, 2024 / 8:31 PM IST

TDP On Pawan Kalyan : అభ్యర్థుల ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లను స్వాగతించింది టీడీపీ. పవన్ సీట్ల ప్రకటనపై తమకేమీ ఇబ్బంది లేదని టీడీపీ స్పష్టం చేసింది. పవన్ కామెంట్లలో తప్పేమీ లేదన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ. టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలావరకు ఫైనల్ అయ్యాయని ఆయన తెలిపారు.

”పవన్ కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది. ప్రకటించారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారు. జనసేన ప్రకటించిన సీట్ల విషయంలో మాకేమీ ఇబ్బంది లేదు. పవన్ కామెంట్ల మీద మాకు లేని బాధ మీకెందుకు..? పవన్ రెండు సీట్లు కాకుంటే.. నాలుగు సీట్లు ప్రకటిస్తారు.. వైసీపీకేంటీ..? పవన్ కామెంట్లు చేసిన గంటలోనే ఐదుగురు వైసీపీ నేతలు మాట్లాడేశారు. మాది పవిత్ర పొత్తు.. కేసుల నుంచి తప్పించుకోవడానికి వైసీపీ పొత్తు పెట్టుకుంటోంది. టీడీపీ-జనసేన పొత్తులు ఎప్పుడు విచ్ఛిన్నం అవుతాయా..? అని వైసీపీ గోతి కాడ నక్కలా కూచుకుని కూర్చొంది” అని విరుచుకుపడ్డారు బోండా ఉమ.

Also Read : పొత్తుపై స్వరం మార్చిన పవన్.. తాను చెప్పాల్సింది క్లారిటీగా చెప్పేశారా!

కాగా.. పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పోటీ చేసే రెండు నియోజకవర్గాల పేర్లను(రాజోలు, రాజానగరం), అక్కడ పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించేశారు. పవన్ తాజా నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు గమనిస్తే.. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతూ తాను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఇచ్చినట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు అంటున్నారు.

”చంద్రబాబుకేనా ఉండేది ఒత్తిళ్లు.. నాపైనా ఒత్తిళ్లు ఉంటాయి. నన్ను తక్కువగా తీసుకుని, ఏవో కొన్ని సీట్లు ఇచ్చేస్తే సరిపోతుందని అనుకోవద్దు. మాకు రావాల్సిన గౌరవకరమైన వాటా రావాల్సిందే. జనసేనను తేలిగ్గా తీసుకోవద్దు. వన్‌వే ట్రాఫిక్‌లా పొత్తు ఉండదు” అంటూ నర్మగర్భంగా తెలుగుదేశం పార్టీకి తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్.

Also Read : టీడీపీకా? జనసేనకా? చంద్రబాబుకి తలనొప్పిగా మారిన విజయవాడ వెస్ట్‌ సెగ్మెంట్