KCR slams centre: మోదీ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించిన మొదటి వ్యక్తిని నేనే: అసెంబ్లీలో కేసీఆర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించిన మొదటి వ్యక్తిని తానేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభ, శాసనమండలి తిరిగి సమావేశమైన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లు, దాని ప్రభావాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.... తెలంగాణలో ఇప్పుడు విద్యుత్ సమస్యలు లేవని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి ఏపీలో విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు.

KCR slams centre: మోదీ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించిన మొదటి వ్యక్తిని నేనే: అసెంబ్లీలో కేసీఆర్

KCR slams centre

Updated On : September 12, 2022 / 11:59 AM IST

KCR slams centre: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించిన మొదటి వ్యక్తిని తానేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభ, శాసనమండలి తిరిగి సమావేశమైన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లు, దాని ప్రభావాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…. తెలంగాణలో ఇప్పుడు విద్యుత్ సమస్యలు లేవని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి ఏపీలో విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు.

రాష్ట్రాలు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాయనేది ప్రగతి సూచికలో ముఖ్యమైనదని తెలిపారు. విద్యుత్ బిల్లును వ్యతిరేకించిన భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఆనాడు అనేక ప్రాంతాల్లో ప్రజలు విద్యుదాఘాతంలో రైతులు చనిపోయారని చెప్పారు. బిల్లులు కట్టలేదని విద్యుత్ అధికారులు దాడులు చేయబోతే కొందరు విషయం తాగి చనిపోయారని తెలిపారు. విద్యుత్ రంగం సహా అనేక సమస్యలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు.

పునర్విభజన హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. కేంద్ర తొలి కేబినెట్ భేటీలోనే తెలంగాణ గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ మండలాలు లాక్కున్నారని, అది అప్రజాస్వామికమని తెలిపారు. బుల్జోజర్లను వాడుతూ పాలన కొనసాగించాలనుకుంటున్నారని అన్నారు. అన్ని ప్రభుత్వ రంగాలనూ అమ్మేస్తున్నారని చెప్పారు.

COVID-19: దేశంలో కొత్తగా 5,221 కరోనా కేసులు.. 47,176 యాక్టివ్ కేసులు