తెలంగాణ బడ్జెట్ : కేంద్ర నిధులు తగ్గుతున్నాయి – హరీష్

  • Published By: madhu ,Published On : March 8, 2020 / 06:09 AM IST
తెలంగాణ బడ్జెట్ : కేంద్ర నిధులు తగ్గుతున్నాయి – హరీష్

Updated On : March 8, 2020 / 6:09 AM IST

కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. ఎన్ని ఇబ్బందులున్నా..రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల లోటు పూడ్చుకోవడం జరిగిందన్నారు. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం శాసనసభలో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…శాంతియుత పంథాలో జరిగిన ఉద్యమం..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.

సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టే అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందన్నారు. భారతదేశ వృద్ధి రేటు తగ్గుతూ వస్తోందని, కేంద్ర ఆదాయ వనరులు తగ్గడంతో రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల్లో కోత పడిందన్నారు. 2019-20 కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా, బడ్జెట్‌లో వేసుకున్న అంచనాల కంటే 3 వేల 731 కోట్ల రూపాయలు తగ్గాయన్నారు.

రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ నిధులు సకాలంలో రావడం లేదని, ఈ కారణాల వల్ల రాష్ట్ర రెవెన్యూ వృద్ధి రేటు..2018-19లో 16.1 శాతం ఉంటే..అది…2019-20 ఫిబ్రవరి చివరి నాటికి…6.3 శాతానికి తగ్గినట్లు వివరించారు.15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారం…తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా…2.437 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గిందని తెలిపారు.

దీనివల్ల 2020-21 సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు..2 వేల 384 కోట్ల తగ్గుతాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సరైన వ్యూహాలు రూపొందించి…అభివృద్ధి..దిశగా పురోగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ 2019-20 అంచనాల మేరకు…మార్చి నెలాఖరు వరకు…లక్షా 36 వేల కోట్ల రూపాయలు ఖర్చు జరుగుతుందన్నారు. కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంటుల్లో కోత పడినప్పటికీ..స్వీయ ఆదాయ వృద్ధి ద్వారా పూడ్చుకున్నామన్నారు.
Read More : కేరళలో బర్డ్ ఫ్లూ : 12 వేల 900 కోళ్లను కాల్చేయాలని నిర్ణయం