G20 Summit Delhi: భద్రతావలయంలో ఢిల్లీ.. G20 సమావేశాల సందర్భంగా రెండు రోజులు సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

సెంట్రల్ ఢిల్లీలో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్లు, మద్యం దుకాణాలు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై ఆంక్షలు విధించడంతో అవన్నీ మూతపడ్డాయి.

G20 Summit Delhi: భద్రతావలయంలో ఢిల్లీ.. G20 సమావేశాల సందర్భంగా రెండు రోజులు సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

Updated On : September 9, 2023 / 11:58 AM IST

G20 Summit: జీ20 సమావేశాల సందర్భంగా శనివారం, ఆదివారం సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రగతి మైదాన్, కర్తవ్యపథ్, ఇండియాగేట్ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలపై నిషేధం విధించారు. సెంట్రల్ సిటీలో బస్సులు, ట్యాక్సీ సర్వీసులపైనా కూడా ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీలో నివసించేవారికి మినహా మరెవరినీ లోపలికి బయటికి అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు, పటేల్ చౌక్, ఆర్కే ఆశ్రమ్ మార్గ్ మెట్రో స్టేషన్లలో 4 రోజుల పాటు పార్కింగ్ నిషేధించారు. ఉద్యోగులు వ్యక్తిగత వాహనాలు వదిలి మెట్రో రైళ్లనే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు.

G-20 Summit: జీ-20 సమావేశాల తొలిరోజు ఒక్కోక్క అతిధిని మోదీ ఎలా ఆహ్వానించారో వీడియో చూడండి

సెంట్రల్ ఢిల్లీలో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్లు, మద్యం దుకాణాలు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై ఆంక్షలు విధించడంతో అవన్నీ మూతపడ్డాయి. జీ 20 భద్రతా విధుల్లో 1.3 లక్షల మంది పోలీస్, పారామిలటరీ సిబ్బంది
ఉన్నారు. నగరంలో అడుగడుగునా సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వినియోగిస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా అనుమానితులను పసిగట్టేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి 160కి పైగా దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దేశాధినేతల విమానాలు మినహా చార్టర్డ్ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. ఇక 207 రైళ్లను రద్దు చేయగా, మరో 36 రైళ్లను దారిమళ్లించారు.