Munugode bypoll: మునుగోడులో తెలంగాణ జన సమితి పోటీ: కోదండరాం ప్రకటన

 మునుగోడులో తెలంగాణ జన సమితి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికపైనే దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో కోదండరాం ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మునుగోడులో పోటీ చేస్తామని, త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్ర అభ్యున్నతి కోసం ప్రత్యేక ఎజెండాతో ముందుకు రావాలని అన్నారు.

Munugode bypoll: మునుగోడులో తెలంగాణ జన సమితి పోటీ: కోదండరాం ప్రకటన

Kodandaram

Updated On : October 7, 2022 / 1:54 PM IST

Munugode bypoll:  మునుగోడులో తెలంగాణ జన సమితి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికపైనే దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో కోదండరాం ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… మునుగోడులో పోటీ చేస్తామని, త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్ర అభ్యున్నతి కోసం ప్రత్యేక ఎజెండాతో ముందుకు రావాలని అన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడం పట్ల కోదండరాం స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన తక్షణ రాజకీయ అవసరాల కోసమే పలు ప్రయత్నాలు చేస్తుంటారని చెప్పారు. కేసీఆర్ కు ఆర్థిక సిద్ధాంతమే లేదని, రాష్ట్రం, దేశం కోసం ఏ ఆర్థిక నమూనాను రూపొందించలేదని విమర్శించారు.

బీఆర్ అంబేద్కర్ కు సిద్ధాంతం ఉంది కాబట్టే ఆయన ఆర్థిక నమూనా చేశారని కోదండరాం అన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జాతీయ పార్టీ పేరును తెరమీదకు తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. కుటుంబ అవసరాల కసం అధికారాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..