కేసీఆర్ యాదాద్రి పర్యటన రేపే

కేసీఆర్ యాదాద్రి పర్యటన రేపే

Updated On : February 2, 2019 / 10:54 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి కొండపైన జరుగుతున్న ఆలయ విస్తరణ పనుల సమీక్ష నిమిత్తం వెళ్లనున్నారు.  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని అభివృద్ధి పనులపై అధికారులతో చర్చలు జరుపుతారు. యాదాద్రి అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు యాదాద్రిలో పర్యటించారు.