ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన : విధుల్లోకి తీసుకొనేది లేదు

  • Published By: madhu ,Published On : November 25, 2019 / 01:49 PM IST
ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన : విధుల్లోకి తీసుకొనేది లేదు

Updated On : November 25, 2019 / 1:49 PM IST

ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ…కీలక ప్రకటన చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకొనేది లేదని వెల్లడించారు. లేబర్ కోర్టు నిర్ణయం తీసుకొనే వరకు సంయమనం పాటించాలని సూచించారు. తాము సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము 2019, నవంబర్ 26వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు చేరుతామని ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. సోమవారం సాయంత్రం ఆర్టీసీ ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు.

సమ్మె విరమిస్తున్నాం అనడం ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం హాస్యాస్పదమని అభివర్ణించారు. ఇష్టం వచ్చినప్పుడు విధులకు..గైర్హాజర్ అవడం, ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరుతామనడం ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండదన్నారు. అన్ని డిపోల దగ్గ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఆర్టీసీ యాజమాన్యం క్షమించదని స్పష్టం చేశారు. 
> దసరా, దీపావళి బతుకమ్మ, లాంటి పర్వదినాల్లో సమ్మెకు దిగి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. 
> యూనియన్ల మాట విని కార్మికులు నష్టపోయారు. 
> ఇకపై యూనియన్ల మాటలు విని మరిన్ని కష్టాలు తెచ్చుకోవద్దు.
> డిపోల దగ్గర శాంతిభద్రతల సమస్యలు సృష్టించొద్దు. 
> శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే..కఠిన చర్యలు తప్పవు. 
Read More : ఆర్టీసీ సమ్మె విరమణ : ప్రభుత్వ ప్రకటనపై ఉత్కంఠ