Varahi Yatra: 1వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో నాల్గవ విడత వారాహి విజయ యాత్ర

2వ తేదీన కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశం అవుతారు. 3వ తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక వీటితో పాటు 4వ తేదీ పెడన, 5వ తేదీ కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.

Varahi Yatra: 1వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో నాల్గవ విడత వారాహి విజయ యాత్ర

Updated On : September 29, 2023 / 9:26 PM IST

Pawan Kalyan Varahi Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర నాల్గవ దశ అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయమై పార్టీ వర్గాల నుంచి శుక్రవారం అధికారిక ప్రకటన వచ్చింది. కాగా, నాల్గవ విడత యాత్ర అవనిగడ్డలో మొదలై 5 రోజుల పాటు జరగనున్నట్లు పార్టీ అధికారికంగా వెల్లడించింది. అక్టోబర్ 1వ తేదీమధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని యక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ మర్నాడే అంటే 2, 3 తేదీల్లో పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో ఉందనున్నారు. 2వ తేదీన కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశం అవుతారు. 3వ తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక వీటితో పాటు 4వ తేదీ పెడన, 5వ తేదీ కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.