నిన్న లక్ష్మీపార్వతిపై, నేడు నాపై : టీడీపీ దుష్ప్రచారం

నిన్న లక్ష్మీపార్వతిపై నేడు తనపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. తన వాయిస్ కాని ఆడియో క్లిప్పులతో దుష్ప్రచారం చేస్తున్నారని

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 03:13 PM IST
నిన్న లక్ష్మీపార్వతిపై, నేడు నాపై : టీడీపీ దుష్ప్రచారం

Updated On : April 6, 2019 / 3:13 PM IST

నిన్న లక్ష్మీపార్వతిపై నేడు తనపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. తన వాయిస్ కాని ఆడియో క్లిప్పులతో దుష్ప్రచారం చేస్తున్నారని

నిన్న లక్ష్మీపార్వతిపై నేడు తనపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. తన వాయిస్ కాని ఆడియో క్లిప్పులతో దుష్ప్రచారం చేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. దీనిపై హైదరాబాద్ పోలీసులకి, ఈసీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. టీడీపీ మేనిఫెస్టో పైన విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చిన టీడీపీ.. ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. సిగ్గు లేకుండా మళ్లీ మేనిఫెస్టో విడుదల చేశారని విమర్శించారు.

విజయసాయి రెడ్డిదిగా చెబుతున్న ఓ వాయిస్ ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. అందులో ఏపీ ప్రజలను, జగన్, ప్రధాని మోడీని కించపరచడం ఉంది. ఈ వాయిస్ విజయసాయి రెడ్డిదే అని ప్రచారం జరుగుతోంది. దీనిపై విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆ వాయిస్ తనది కాదని స్పష్టం చేశారు. దొంగ దెబ్బకొట్టేందుకు టీడీపీ పన్నిన కుట్రగా అభివర్ణించారు. ఆడియోలో ఆ వాయిస్‌ ఎవరిదన్నది…సీఎఫ్‌ఎల్‌సీకి నిర్థారణ చేసిన తర్వాతే తెలుస్తుందన్నారు. ఓటుకు నోటుకు కేసులో ఉన్న వాయిస్‌ చంద్రబాబుదేనని స్పష్టమైందన్నారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబుతో పాటు ఆయనకు సహకరించిన వారందరు జైలుకెళ్లడం ఖాయమని విజయసాయి రెడ్డి అన్నారు.