Asaduddin Owaisi: హిజాబ్ ధరించిన యువతి భారత ప్రధాని కావాలన్న ఓవైసీకి చురకలు అంటించిన బీజేపీ

మంగళవారం బీజాపూర్‭లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘బ్రిటన్ అత్యున్నత పదవిని రిషి సునాక్ అధిరోహించారు. హిజాబ్ ధరించిన యువతి భారత దేశానికి ప్రధానమంత్రి అవుతుంది’’ అని అన్నారు. కాగా, ఓవైసీ వ్యాఖ్యలకు బుధవారం బీజేపీ కౌంటర్ అటాక్ చేసింది. ఎంఐఎంకు హిజాబ్ ధరించిన యువతిని అధినేతను ఎప్పుడు చేస్తారని, అలా జరగకుండా ఏ రాజ్యాంగం అడ్డుకుంటోందని ప్రశ్నించారు.

Asaduddin Owaisi: హిజాబ్ ధరించిన యువతి భారత ప్రధాని కావాలన్న ఓవైసీకి చురకలు అంటించిన బీజేపీ

Want to see a woman wearing hijab as India Prime Minister says Owaisi

Updated On : October 26, 2022 / 8:15 PM IST

Asaduddin Owaisi: దేశంలో ఒకవైపు హిజాబ్ కాంట్రవర్సీ నడుస్తుంటే.. మరొక వైపు హిజాబ్ ధరించిన యువతి దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఘాటుగా స్పందించింది. భారతదేశానికి ప్రధానమంత్రి తర్వాత.. ముందు ఎంఐఎంకు హిజాబ్ ధరించిన యువతి అధినేత ఎప్పుడు అవుతారని సూటిగా ప్రశ్నించింది. బ్రిటన్ ప్రధానమంత్రిగా భారత మూలాలున్న రిషి సునాక్ ఎన్నికైనప్పటి నుంచి భారత రాజకీయాల్లో మైనారిటీ ప్రాధాన్యం గురించి ముస్లిం నేతలు చర్చ చేస్తున్నారు. మొన్న మెహబూబా ముఫ్తీ.. సీఏఏ, ఎన్ఆర్‭సీ అంశాలను లేవనెత్తుతూ మైనారిటీ హక్కుల గురించి మాట్లాడగా.. తాజాగా ఓవైసీ భారత రాజకీయ అధికారంలోకి మైనారిటీల పాత్రపై పై విధంగా స్పందించారు.

ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో ఉన్న ఓవైసీ.. మంగళవారం బీజాపూర్‭లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘బ్రిటన్ అత్యున్నత పదవిని రిషి సునాక్ అధిరోహించారు. హిజాబ్ ధరించిన యువతి భారత దేశానికి ప్రధానమంత్రి అవుతుంది’’ అని అన్నారు. కాగా, ఓవైసీ వ్యాఖ్యలకు బుధవారం బీజేపీ కౌంటర్ అటాక్ చేసింది. ఎంఐఎంకు హిజాబ్ ధరించిన యువతిని అధినేతను ఎప్పుడు చేస్తారని, అలా జరగకుండా ఏ రాజ్యాంగం అడ్డుకుంటోందని ప్రశ్నించారు.

ఇక ఈ విషయమై సోమవారం మెహబూబా స్పందిస్తూ ‘‘బ్రిటన్‭కు మొదటి భారత సంతతి వ్యక్తి ప్రధానమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. భారతదేశం అంతా దీన్ని గొప్పగా భావిస్తున్నారు. మైనారిటీ ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని ప్రధానమంత్రిగా బ్రిటన్ అంగీకరించింది. అయితే మనం ఇప్పటికీ మైనారిటీలను గౌరవించడం లేదు. ఎన్ఆర్‭సీ, సీఏఏ వంటి విభజన, వివక్షపూరిత చట్టాల ద్వారా సంకెళ్లు వేస్తున్నామని గుర్తుంచుకోవాలి’’ అని ట్వీట్ చేశారు.

దీనిపై రవి శంకర్ ప్రసాద్ స్పందిస్తూ ”రిషి సునాక్ బ్రిటిన్ ప్రధాని కావడంతో మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ చేసిన ట్వీట్ కామెంట్‌ చూశాను. ఇండియాలోని మైనారిటీ హక్కులపై ఆమె వ్యాఖ్యలు చేశారు. మెహబూబా జీ…జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో ఒక మైనారిటీని ముఖ్యమంత్రిగా మీరు అంగీకరిస్తారా?” అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ఇక దేశానికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా 10 ఏళ్లు ఉండడాన్ని, ఏపీజే అబ్దుల్ కలాంటి రాష్ట్రపతిగా చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. మైనారిటీని గౌరవించకుండానే వారు దేశాధినేతలు అయ్యారా అని చురకలు అంటించారు.

China Tour: చైనా పర్యటనకు పాక్ ప్రధాని.. వ్యూహాత్మక సహకారం ఇదరు దేశాల ఎజెండా!