INDIA 3rd Meet: ముంబైలో జరిగే మూడో విపక్ష సమావేశానికి కేజ్రీవాల్ హాజరవుతున్నారా? ఆయన ఏమన్నారంటే?

అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రకటనలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో నేరుగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడ 10 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

INDIA 3rd Meet: ముంబైలో జరిగే మూడో విపక్ష సమావేశానికి కేజ్రీవాల్ హాజరవుతున్నారా? ఆయన ఏమన్నారంటే?

Updated On : August 21, 2023 / 3:34 PM IST

Opposition 3rd Meet: విపక్ష కూటమి ఇండియా మూడవ సమావేశం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరగనుంది. అయితే ఈ సమావేశానికి ముందే ఇండియా కూటమిలో లుకలుకలు కనిపించాయి. బెంగళూరులో జరిగిన రెండవ మీటింగ్ అనంతరమే బిహార్ నేతలు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. ఇక తాజాగా ఢిల్లీలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ నేత ప్రకటనపై ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మూడో సమావేశంలో ఆప్ పాల్గొనడంపై అనుమానాలు వచ్చాయి. అయితే తాజాగా వీటిపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు.

CM Jagan : 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చరిత్ర చంద్రబాబుది, శవ రాజకీయాలు చేస్తున్నాడు : సీఎం జగన్

ముంబైలో జరగనున్న I.N.D.I.A సమావేశానికి ఆప్ హాజరవుతుందని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. విపక్ష కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో జరగనుంది. వాస్తవానికి, కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్ మధ్య పోరు సాగుతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. ఆ తర్వాత ఈ సమావేశానికి ఆప్ హాజరు కాదనే ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ సమావేశానికి తమ పార్టీ హాజరవుతుందని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

BRS Candidates 1st List: బీఆర్ఎస్ మొదటి లిస్ట్ వచ్చేసింది.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు వీరే..

అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రకటనలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో నేరుగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడ 10 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

అల్కా లాంబా ప్రకటనపై దుమారం
తాజాగా ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం అల్కా లాంబా సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అల్కా లాంబా చెప్పడం వివాదాస్పదమైంది. దీని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కృతనిశ్చయంతో ఉంటే, దానితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని అన్నారు.