నెరవేరేనా : తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం – బండి సంజయ్

  • Published By: madhu ,Published On : March 16, 2020 / 02:22 AM IST
నెరవేరేనా : తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం – బండి సంజయ్

Updated On : March 16, 2020 / 2:22 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తా..ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం..తాను ప్రజల్లోనే ఉంటానంటున్నారు బీజేపీ కొత్త బాస్ బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులిగా నియమితులయ్యాక తొలిసారిగా ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కాషాయ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గన్ పార్క్ వద్ద తెలంగాణ అమీరువీరుస్థూపానికి నివాళలర్పించిన ఆయన..నేరుగా పార్టీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. 

గోల్కోండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. త్వరలో భైంసాకు వచ్చి అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లిన వారిని పరామర్శిస్తానని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ..కార్యకర్తలకు అండగా ఉంటానని వెల్లడించారు. ఈ సందర్భంగా బండి సంజయ్..టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా..లక్షన్నర కోట్లు ఇచ్చినా ఆ నెపం కేంద్రంపై నెడుతున్నారంటూ ఆరోపించారాయన. రాష్ట్రంలో పథకాలకు ఇచ్చే డబ్బు ఎక్కడిదో చెప్పాలని, ఇందుకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు అభినందనలు తెలిపారు పార్టీ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్. రాష్ట్ర అధ్యక్షులైన తమ పార్టీ నేతల్లో ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదని చెప్పుకొచ్చారు. గ్రేటర్  ఎన్నికల్లో  టీఆర్ఎస్‌‌ను ఓడించాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

Read More : ప్యాకప్ : టాలీవుడ్‌పై కరోనా ఎఫెక్ట్..షూటింగ్‌లు బంద్