’జనసేన’కు యర్రా నవీన్ గుడ్ బై
జనసేన పార్టీకి యర్రా నవీన్ రాజీనామా చేశారు.

జనసేన పార్టీకి యర్రా నవీన్ రాజీనామా చేశారు.
పశ్చిమ గోదావరి : జనసేన పార్టీకి యర్రా నవీన్ గుడ్ బై చెప్పారు. జిల్లా కో-కన్వీనర్ గా పని చేస్తున్న ఆయన మార్చి 14 గురువారం పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్ కనీసం తనను సంప్రదించకుండా తాడేపల్లిగూడెం అభ్యర్థిని ప్రకటించారన్న మనస్తాపంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి పార్టీలోకి వచ్చానని పేర్కొన్నారు. జనసేన పార్టీ అన్ని పార్టీల లాంటిది కాదనుకున్నానని… కానీ ఇది కూడా స్వార్థ రాజకీయ పార్టీ అని తేలిపోయిందన్నారు. తన రాజీనామాతో అయినా మళ్లీ ఇటువంటి పొరపాటు జరుగకుండా చూస్తారనే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.
Read Also : కాంగ్రెస్‌కు మరో షాక్: టీఆర్ఎస్‌లోకి పాలేరు ఎమ్మెల్యే
పార్టీలో కష్టపడిన వారికి ప్రాధానత్య లేదని వాపోయారు. పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఇతర పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన వారికి టికెట్ ఇవ్వడం సమంజసం కాదన్నారు. తాడేపల్లిగూడెం అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కనీసం జనసేన పార్టీ కార్యాలయంలో అప్లికేషన్ కూడా పెట్టలేదని పేర్కొన్నారు. అప్లికేషన్ పెట్టిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదని.. కష్టపడిన వారికి ఇచ్చి ఉంటే చాలా సంతోషించేవాడినని అభిప్రాయపడ్డారు.