3 రాజధానులపై వైసీపీ శ్రేణుల సంబరాలు : సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
ఏపీలో రాజధాని అంశం చివరి అంకానికి చేరుకుంది. ఓవైపు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతుంటే.. మరోవైపు వికేంద్రీకరణకు మద్దతుగా సంబురాలు జరుపుతున్నారు.

ఏపీలో రాజధాని అంశం చివరి అంకానికి చేరుకుంది. ఓవైపు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతుంటే.. మరోవైపు వికేంద్రీకరణకు మద్దతుగా సంబురాలు జరుపుతున్నారు.
ఏపీలో రాజధాని అంశం చివరి అంకానికి చేరుకుంది. ఓవైపు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతుంటే.. మరోవైపు వికేంద్రీకరణకు మద్దతుగా సంబురాలు జరుపుతున్నారు. అమరావతి వద్దు.. అన్ని ప్రాంతాల అభివృద్ధే ముద్దు అంటూ నినాదాలతో స్వీట్లు పంచుకున్నారు. విశాఖ, కర్నూలుతో పాటు పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలు సీఎం జగన్‌కు అభినందనలు తెలిపారు.
ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టగానే విశాఖ, కర్నూలు జిల్లా వాసులు సంబురాలు మొదలుపెట్టారు. ఓ వైపు అమరావతి ప్రాంతంలో నిరసనలు మిన్నంటగా.. మిగిలిన ప్రాంతాల్లో ప్రభుత్వానికి మద్దతుగా అభినందనలు వెల్లువెత్తాయి. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే.. ఒక్క ప్రాంతమే అభివృద్ధి చెందుతుందని.. పరిపాలనా వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖను పరిపాలనా రాజధానిగా స్వాగతిస్తూ.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ ఎంతో అనుకూలమైనదని.. దీంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి బాటలో నడవడం ఖాయమని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు
ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టగానే కర్నూలు జిల్లాలో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం న్యాయ రాజధానిగా కర్నూలుకు న్యాయం జరిగిందన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా మూడు రాజధానుల ఏర్పాటుకు కేబినెట్ అమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మకూరు, పట్టణంలో వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానులకు కెబినెట్ ఆమోదం తెలపడంతో సంతోషం వ్యక్తం చేశారు. రాజమండ్రి వైసీపీ నాయకులు, కార్యకర్తలు బణాసంచాలు పేల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అమరావతిలో రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని.. దీంతో రాష్ట్రంలో ఎలాంటి సమస్యలకు తావులేకుండా వైసీపీ కృషి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.