Jogi Ramesh : మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా జోగి రమేశ్? సీఎం జగన్ వ్యూహం ఏంటి
ఈ సర్వే రిపోర్టు పాజిటివ్ గా వస్తే జోగి రమేశ్ ను బందర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ జోగి రమేశ్ కాకపోతే మాజీ ఎంపీ బాడుగు రామకృష్ణ పేరును కూడా పరిశీలిస్తున్నారు.

Jogi Ramesh
Jogi Ramesh : మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ పైన వైసీపీ సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన సింహాద్రి రమేశ్ పేరును మార్చాలని నిర్ణయించింది వైసీపీ అధిష్టానం. ఈసారి బీసీ అభ్యర్థి పేరుతో ప్రయోగం చేయాలనే ఆలోచన చేస్తోంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి జోగి రమేశ్ పేరును పరిశీలనలోకి తీసుకున్నారు. ఇదే అంశంపైనా ఐప్యాక్ టీమ్ తో సర్వే కూడా చేయిస్తున్నారు.
ఈ సర్వే రిపోర్టు పాజిటివ్ గా వస్తే జోగి రమేశ్ ను బందర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ జోగి రమేశ్ కాకపోతే మాజీ ఎంపీ బాడుగు రామకృష్ణ పేరును కూడా పరిశీలిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఎంపీగా బందరు పార్లమెంటుకు పని చేసిన అనుభవం బాడుగ రామకృష్ణకు ఉంది. పైగా వివాదరహితుడిగా రామకృష్ణకు మంచి పేరు ఉన్నట్లు వైసీపీ అధిష్టానం తెలుసుకుంది. మొత్తానికి సిద్ధం సభ తర్వాత బందరు పార్లమెంట్ అభ్యర్థిపై క్లారిటీ రానుంది.
ఇప్పటికే బందరు ఎంపీ అభ్యర్థిగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ పేరును వైసీపీ హైకమాండ్ ఖరారు చేసింది. అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బందర్ పార్లమెంట్ కి సింహాద్రి రమేశ్ ను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు సమాచారం. కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు వైసీపీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ.. బీసీ అభ్యర్థిని దింపి ఒక ప్రయోగం చేసి రెండుసార్లు సక్సెస్ అయ్యింది. అదే ఫార్ములాను ఈసారి బీసీ అభ్యర్థిని బందరు పార్లమెంట్ బరిలోకి దింపి మరొకసారి ప్రయోగం చేయాలనే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. బందరు పార్లమెంట్ పరిధిలో గౌడ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ.
ఒకవైపు కాపులు, మరోవైపు బీసీలు ఎక్కువగా ఉన్న బందరు పార్లమెంటు నియోజకవర్గంలో మంత్రి జోగి రమేశ్ పేరును వైసీపీ హైకమాండ్ పరిశీలిస్తోంది. బందరు పార్లమెంటు బరిలో జోగి రమేశ్ ను దింపితే ఎలా ఉంటుంది? అని యోచన చేస్తోంది. దీనికి సంబంధించి వేర్వేరు సర్వేలు చేస్తున్నారు. సర్వే రిపోర్టులు పాజిటివ్ గా వస్తే జోగి రమేశ్ ను బందరు వైసీపీ అభ్యర్థిగా నిలిపే ఛాన్స్ ఉంది.
బీసీ సామాజికవర్గం నేతను దింపాలంటే జోగి రమేశ్ పేరు పరిశీలనలో ఉండగా.. కాపు సామాజికవర్గానికి చెందిన నేతను దింపాలంటే.. బాడుగ రామకృష్ణ పేరును కూడా వైసీపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. ఆయన హయాంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారనే పేరుంది. ఈ క్రమంలో కాపు సామాజికవర్గానికి చెందిన బాడుగ రామకృష్ణ పేరును ఫైనల్ చేస్తారా? లేక బీసీ, గౌడ సామాజికవర్గానికి చెందిన జోగి రమేశ్ పేరును ఖరారు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..