మల్లాది విష్ణుకి కీలక పదవి కట్టబెట్టిన సీఎం జగన్

  • Published By: chvmurthy ,Published On : January 11, 2020 / 12:02 PM IST
మల్లాది విష్ణుకి కీలక పదవి కట్టబెట్టిన సీఎం జగన్

Updated On : January 11, 2020 / 12:02 PM IST

విజయవాడ సెంట్రల్  నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి సీఎం జగన్ కీలక పదవి  కట్టబెట్టారు.  ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ  వేల్ఫేర్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం. జనవరి11న ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ పదవిలో విష్ణు 2 ఏళ్ళపాటు కొనసాగుతారు. 

అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విష్ణు 2019 లో ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటుగా వ్యవహరించారు మల్లాది విష్ణు.

అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన విష్ణు ఎన్నికల ముందు వైసీపీ లో చేరి  సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా పై గెలుపొందారు.  కేబినెట్ లో బెర్త్ దొరుకుతుందని ఆశించినప్పటికీ  తాజాగా  కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇవ్వటంతో ఆయన అభిమానులు, అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Malladi Vishnu orders