Yennam Srinivas Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేయాలి- కేటీఆర్ లీగల్ నోటీసులపై యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పందన

నీ ప్లేస్ లో నేనే ఉంటే.. డీజీపీకి లేఖ రాసే వాడిని.. నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరేవాడిని. లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని చూస్తున్నారు.

Yennam Srinivas Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డిస్‌క్వాలిఫై చేయాలి- కేటీఆర్ లీగల్ నోటీసులపై యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పందన

Yennam Srinivas Reddy

Updated On : April 4, 2024 / 4:39 PM IST

Yennam Srinivas Reddy : మాజీ మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారాయన. కేటీఆర్ నాతో పాటు మరో ఇద్దరికి లీగల్ నోటీసులు పంపారు. అసలు ఆయనకు లా, అడ్మినిస్ట్రేషన్ పై అవగాహన ఉందా? అని ఎమ్మెల్యే యెన్నం ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పై వరుస కథనాలు వస్తున్నాయి, దానిపై మేము కూడా నా ఫోన్ ట్యాప్ అయినట్లు డీజీపీకి ఫిర్యాదు చేశాం అని యెన్నం అన్నారు.

ఇన్వెస్టిగేషన్ జర్నలిజంపై కేటీఆర్ కు ఏం తెలుసు? బ్లాక్ మెయిల్ బెదిరింపులు తప్పా? అని ధ్వజమెత్తారు. మాకు లీగల్ నోటీసులు ఎలా ఇస్తారు? విచారణ జరుగుతున్నప్పుడు లీగల్ నోటీసులు ఇస్తారా? అని నిలదీశారు. ఫామ్ హౌస్ లో ఒకరు, గెస్ట్ హౌస్ లో ఇంకోరు ఉండి పాలన సాగించారు అని బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు. అడ్డిమారి గుడ్డి దెబ్బల పాలన సాగినట్లుందని ఎద్దేవా చేశారు.

”పోలీస్ ఆఫీసర్లను జైల్లో ఎందుకు పెడ్తారు? ఆధారాలు ఉంటేనే కదా? నీ ప్లేస్ లో నేనే ఉంటే.. డీజీపీకి లేఖ రాసే వాడిని.. నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరేవాడిని. లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని చూస్తున్నారు. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలించినట్లు వార్తలు కూడా వచ్చాయి.

కాగా.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ కన్నెర్రజేశారు. ఒక మంత్రి, ఎమ్మెల్యే సహా ముగ్గురికి లీగల్ నోటీసులు పంపారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు కేటీఆర్.

పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ చానళ్లకూ లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. తనపై అసత్య ఆరోపణలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని కూడా వదిలేది లేదన్నారు. ప్రజల్లో తన పాపులారిటీని దెబ్బతీసేందుకే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో తనపై ఓటమిని జీర్ణించుకోలేక కేకే మహేందర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తక్షణమే ఆరోపణలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటానికి సిద్ధం కావాలని హెచ్చరించారు. మేనేజ్ మెంట్ కోటాలో వచ్చిన కేటీఆర్ కు ఏం తెలుసు? అధికార దుర్వినియోగం చేసినందుకు 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చెయ్యాలి.

అసలు లీగల్ నోటీసులు రేవంత్ రెడ్డి కేటీఆర్ కు ఇవ్వాలి. ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఆరోపణ చేసినందుకు. ఇతర పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేయడమే కాదు.. సొంత ఇంటి వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయలేదా? దీనికి కూడా నోటీసులు ఇస్తే ఇచ్చేయ్. ఫోన్ ట్యాపింగ్ అనేది సమాజ వ్యతిరేక శక్తులపై చేస్తారు. కానీ వ్యక్తుల ఫోన్లు చేస్తారా? హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. దాని సంగతేంటి? అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read : పెద్దపల్లిలో బస్తీమే సవాల్‌.. ఈ ముగ్గురిలో విక్టరీ కొట్టేదెవరు?