చంద్రబాబు పాలనలో రౌడీల రాజ్యం : విజయమ్మ

ప్రకాశం : చంద్రబాబు పాలనలో రౌడీల రాజ్యం నడుస్తోందని వైఎస్ విజయమ్మ విమర్శించారు. ఆయనకు విశ్వసనీయత ఉండదన్నారు. ప్రతి ప్రాజెక్టును జగన్ అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు విజయమ్మ. చంద్రబాబు కట్టిన పోలవరం ప్రాజెక్టు ఎవరికైనా కనిపిస్తుందా అన్నారు. ఎర్రగొండపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రసంగించారు.
ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 2014 లో కాంగ్రెస్ తో వైఎస్సార్ పొత్తు పెట్టుకుందని తెలిపారు. 2019లో బీజేపీ, టీఆర్ఎస్ తో వైసీపీ పొత్తు పెట్టుకుందని చెప్తున్నారని జగన్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు.