రాత్రి గం.8-30 ల దాకా వైన్ షాపులకు అనుమతి

  • Published By: murthy ,Published On : June 6, 2020 / 01:20 AM IST
రాత్రి గం.8-30 ల దాకా వైన్ షాపులకు అనుమతి

Updated On : June 6, 2020 / 1:20 AM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జూన్ 6 నుంచి మద్యం షాపులు రాత్రి  గం.8-30 వరకు తెరిచే ఉంటాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. హరితహారంలో భాగంగా ఈ ఏడాది 45 లక్షల తాటి, ఈత మొక్కలను నాటేందుకు తగినంత ప్రణాళిక సిద్ధం చేయాలని, గుడుంబా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

అర్హత కలిగిన ప్రతి గీత కార్మికునికీ శాఖాపరమైన సభ్యత్వ కార్డులను అందజేయాలని, సొసైటీలకు ఇచ్చే తాటి, ఈత చెట్ల కాలపరిమితిని కూడా పదేళ్ల పాటు పెంచుతూ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని శ్రీనివాస గౌడ్ చెప్పారు. అదనంగా తాటి, ఈత చెట్లను అదనపు రేషన్‌ కావాలంటే శాఖా పరంగా సంబంధిత అధికారులను సంప్రదించి అనుమతి తీసుకోవాలన్నారు.

ఆబ్కారీ శాఖలో మహిళా ఉద్యోగులకు ఎలాంటి వేధింపులు జరిగినా కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా ఉండేలా స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలను పటిష్టపరిచేందుకు ఒక సమర్థవంతమైన అధికారిని నియమిస్తామన్నారు. నీరా అమ్మకాలను ప్లాస్టిక్‌ సీసాలలో కాకుండా టెట్రా ప్యాక్‌లలో మాత్రమే జరపాలని మంత్రి కోరారు. 

Read: జూన్ 20 నుంచి JNTUH Btech, B-pharmacy పరీక్షలు