అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

అంతర్వేది ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈరోజు రాత్రి 12.29 నిమిషాలకు శుభముహర్తన స్వామి వారి అమ్మవార్ల దివ్య కళ్యాణం జరుగుతుంది.

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

antarvedi kalyanam 2024 date and time full details here

antarvedi kalyanam 2024: అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పుణ్యక్షేత్రంలో శ్రీలక్ష్మి నరసింహస్వామి దివ్య తిరు కల్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈరోజు రాత్రి 12.29 నిమిషాలకు శుభముహర్తన స్వామి వారి అమ్మవార్ల దివ్య కళ్యాణం జరుగుతుంది. ఆరుద్రా నక్షత్ర యుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరపనున్నారు. సాయంత్రం 4 గంటలకు పంచముఖ ఆంజనేయ స్వామి వాహనంపై శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారు ఊరేగుతారు. రాత్రి 7 గంటలకు కంచుగరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు.

కళ్యాణ మహోత్సవానికి ఆలయ అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించనున్నారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ప్రత్యేకమైన ఎల్ఈడీ స్క్రీన్స్ పెట్టారు. భక్తుల కోసం ఆలయ చుట్టుపక్కల షెడ్డులను నిర్మించారు. సుమారు 1600 మంది సిబ్బందితో బందోబస్తును పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 135 అదనపు ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది.

శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం ముగిసిన తర్వాత ఈ తెల్లవాముజామున 3 గంటల నుంచి ఆలయంలో స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. కాగా, భీష్మ ఏకాదశి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం రథోత్సవం జరుగుతుంది. రథోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: ఘనంగా తిరుపతి ఆవిర్భావ వేడుకలు: టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి