Srisaila Devasthanam : శ్రీశైలంలో మొదలైన ఆర్జిత సేవలు

Srisaila Devasthanam : శ్రీశైలంలో మొదలైన ఆర్జిత సేవలు

Srisailam Temple

Updated On : July 12, 2021 / 12:17 PM IST

Srisaila Devasthanam :  కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ,మల్లిఖార్జునస్వామి అమ్మవార్ల ఆలయంలో ఆర్జిత సేవలు ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, పరిమిత సంఖ్యలో ఆర్జిత సేవల నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీ స్వామి వారికి సామూహిక అభిషేకాలు, అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపములో కుంకుమార్చనలు. గణపతి హోమం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, చండీ హోమం సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, సాయంకాలం వేళలలో శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణం జరిపించుకునే అవకాశం కల్పించినట్లు ఆలయ అధికారులు వివరించారు.