Mahakumbh 2025 : మహాకుంభమేళాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఛోటూ బాబా.. ఎత్తు 3 అడుగులే.. 32ఏళ్లుగా స్నానం చేయలేదట!

Mahakumbh 2025 : 32 ఏళ్లుగా స్నానం చేయలేదు.. 3.8 అడుగుల ఎత్తు ఉన్న చోటూ బాబా మహాకుంభ్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.

Mahakumbh 2025 : మహాకుంభమేళాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఛోటూ బాబా.. ఎత్తు 3 అడుగులే.. 32ఏళ్లుగా స్నానం చేయలేదట!

Chhotu Baba Is Maha Kumbh Attraction

Updated On : January 3, 2025 / 11:25 PM IST

Mahakumbh 2025 : మహాకుంభమేళాకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రయాగ్‌రాజ్‌కు సాధువులు వచ్చే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈసారి మహాకుంభానికి వచ్చిన గంగాపురి మహారాజ్ (ఛోటూ బాబా) సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఛోటూ బాబా కేవలం 3.8 అడుగుల ఎత్తు ఉండగా, గత 32 సంవత్సరాలుగా అసలు స్నానమే చేయలేదని అంటున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమయ్యే మహాకుంభ్-2025 కోసం భక్తులు, ఋషులు, సాధువుల రాక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మహాకుంభ్‌లో వేలాది మంది నాగ సన్యాసిలు, సాధువులు జపం చేయడం, తపస్సు చేయడం, ధ్యానం చేయడం కనిపిస్తుంది.

అయితే, వారిలో గంగాపురి మహారాజ్ (ఛోటూ బాబా) జనంలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. ఛోటూ బాబాను చూసిన వారంతా ఆగి, ఫోటోలు దిగడంతో పాటు సెల్ఫీలు తీసుకుంటున్నారు. రోడ్డు మీదకు రాగానే జనం చుట్టుముట్టడం వల్ల, ఆయన ఎక్కువ సమయం క్యాంపులో లేదా గంగా ఒడ్డున ఏకాంతంగా సాధన చేస్తూ గడిపేవారు. గంగాపురి మహారాజ్ జునా అఖారా నాగా సెయింట్, సన్యాసిలలో పెద్దవాడు. అత్యంత మహిమాన్వితమైనవాడు. అస్సాంలోని కామాఖ్య పీఠంతో సంబంధం ఉంది. కోట్లాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌కు గంగామాత దీవెనలు పొందడానికి వస్తున్నారు కానీ, గంగాపురి మహారాజ్ (ఛోటూ బాబా) ఇక్కడ ఒక్కసారి కూడా గంగా స్నానం చేయరు.

ఛోటూ బాబా పేరుతో ఫేమస్ అయ్యాడు :
గంగాపురి మహారాజ్ మహాకుంభ్‌లో ఛోటూ బాబా తన ఎత్తు కారణంగా వార్తల్లో నిలిచాడు. అక్కడికి వచ్చేవారందరికి ఆకర్షణగా నిలిచాడు. అతని వయస్సు 57 సంవత్సరాలు అయినప్పటికీ అతని ఎత్తు కేవలం 3 అడుగులు మాత్రమే. ఎత్తు తక్కువగా ఉండడంతో చాలా మంది ఛోటూ బాబా అని, మరికొందరు చిన్న బాబా అని పిలుస్తుంటారు. అయితే, గంగాపురి మహారాజ్ తన ఎత్తు విషయంలో ఏమాత్రం నిరాశ చెందడం లేదు. కేవలం మూడడుగుల ఎత్తు తన బలహీనత కాదని అదే తన బలమని అంటున్నాడు. అందుకే ఆయన్ను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు.

Chhotu Baba Is Maha Kumbh Attraction

Chhotu Baba Maha Kumbh Attraction

గంగాపురి మహరాజ్‌కి సంబంధించిన మరో విశేషమేమిటంటే.. ఆయన గత 32 ఏళ్లుగా స్నానం చేయలేదట. ముప్పై రెండేళ్లుగా కూడా నెరవేరని కోరిక దీని వెనుక కారణంగా చెప్పవచ్చు. అయితే, తన తీర్మానంపై ఎలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఇష్టపడడం లేదు. తన కోరిక నెరవేరిన రోజు ముందుగా క్షిప్రా నదిలో స్నానం చేస్తానని చెప్పారు. ఛోటూ బాబా ప్రకారం.. శరీరం కన్నా అంతర్గత మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇతర నాగా సాధువుల గుంపుకు దూరంగా ఏకాంతంలో తంత్ర సాధన చేసేందుకు ఇష్టపడతాడు. ఛోటూ బాబా అనేక శ్మశాన వాటికలలో సాధన కూడా చేశారు.

తొలిసారిగా మహాకుంభానికి ఛోటూ బాబా :
గంగాపురి మహారాజ్ (ఛోటూ బాబా) మొదటిసారిగా ప్రయాగ్‌రాజ్ మహాకుంభానికి వచ్చారు. ఈ కారణంగా బాబాకు ఇంకా ఏ శిబిరం దొరకలేదు. ఛోటూ బాబా ఇతర సాధువుల శిబిరంలో నివసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం త్వరలో తనకు కూడా క్యాంపులు, సౌకర్యాలు కల్పిస్తారని ఛోటూ బాబా ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే, ఛోటు బాబా తన ఎత్తుకు మాత్రమే కాకుండా ఆయన రహస్య, ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రసిద్ధి చెందాడు. ఇతర సాధువులు, భక్తులు ఆయనకు కనిపించే విధంగా చిన్నవాడు కావచ్చు. కానీ, ఆయన జ్ఞానం, మాటలు ఎంతో విలువైనవి. మహాకుంభానికి వచ్చినా స్నానాల పండుగలో పాల్గొననని ఛోటూ బాబా స్పష్టం చేశాడు.

Read Also : Human Metapneumovirus : ప్రమాదంలో 14 ఏళ్లలోపు పిల్లలు..! చైనాలో కొత్త వైరస్ కలకలం..