Chinna Jeeyar Swamy : చిన్న జీయర్ స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవములు

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవాలు ఈనెల4 నుంచి 8వ తేదీ వరకు జరగుతాయి.

Chinna Jeeyar Swamy : చిన్న జీయర్ స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవములు

Chinna Jeeyar Swamy

Updated On : November 3, 2021 / 5:58 PM IST

Chinna Jeeyar Swamy :  శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవాలు ఈనెల4 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం, ముచ్చింతల్ లోని జీవా ప్రాంగణంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి.

ఈ ఉత్సవాల్లో భాగంగా నవంబర్ 4వ తేదీ ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ గోపాల ప్రసాద్ శర్మ గారికి జీయర్ పురస్కారం  ప్రదానం చేస్తారు.  1994వ సంవత్సరం నుంచి ఈ పురస్కారాలను ఎందరో మహానుభావులైన   వేదవిద్వాంసులు అందుకున్నారు. ఈ ఏడాది జీయర్ అవార్డు పురస్కారానికి గోపాల్ ప్రసాద్ శర్మగారిని ఎంపిక చేశారు.

Also Read : Karthika Masam : శివకేశవులకు ప్రీతికరం….కార్తీక మాసం….ప్రతిరోజు పర్వదినమే!..

నవంబర్ 5వ తేదీ ఉదయం శ్రీ కోదండరామ స్వామి వారికి కుంకుమార్చన,  6వ తేదీ ఉదయం తులసీ అర్చన,  7వ తేదీ ఉదయం పుష్పార్చన మరియు సమాశ్రయణములు నిర్వహిస్తారు.  8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి స్వామి వారి ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రునికి సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నిటినీ www.youtube.com/jetworld లో ప్రసారం అవుతాయి.