దీపావళి వేడుక : ఈ జాగ్రత్తలు తీసుకోండి

దీపావళి వేడుక వచ్చిదంటే చాలు చిన్నా పెద్దా అందరికీ ఆనందమే. టపాసులు కాల్చటానికి పిల్లలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఈ ఆనందంలో పడి ప్రమాదాలకు గురవుతుంటారు. ఇటువంటి ఘటనలలు గతంలో చాలానే జరిగాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండి దీపావళి వేడుకను జరుపుకోవాలి. దీపావళి ఆనందంగా జరుపుకోవాలి తప్ప విషాదాలను నింపకూడదు. దీని కోసం పిల్లలతో పాటు పెద్దలు కూడా తగిన జాగ్రత్తులు తీసుకోవాలి.మరి ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..ఆనందంగా దీపావళి చేసుకుందాం.
– టపాసులు పేల్చటానికి నిప్పు అంటించి దూరంగా పడేస్తాం. వాటిలో కొన్ని పేలకుండా మధ్యలో ఆగిపోతాయి. వాటిని తిరిగి వెలిగించే ప్రయత్నం అస్సలు చేయకూడదు. వాటి దగ్గరకు పోకూడదు. అలా పడేసిన టపాసుల నిప్పు పైకి కనిపించకపోయినా..లోపల దానికి సంబంధించిన వేడి ఉంటుంది. అటువంటి సమయంలో వాటి దగ్గరకు వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకోవాల్సి కొందరు యత్నిస్తుంటారు. అటువంటి సమయంలో అది పేలే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటివాటికి దయచేసి దూరంగా ఉండండి. ముందు జాగ్రత్తగా అలాంటివాటిపై నీటిని పోసి తడిపేయండి. అది మనకే కాదు ఎవ్వరికీ హాని కలుగకుండా ఉండాలంటే నీటి పోసి ఆర్పేయండి.
– ఎటువంటి అగ్ని ప్రమాదం సంభవించినా వెంటనే మంటలను అదుపు చేయటానికి ముందు జాగ్రత్తగా నీటిని అందుబాటులో ఉంచుకోవాలి.
– క్రాకర్స్ కాల్చే సమయంలో కొన్ని నిప్పు రవ్వలు ఒంటిపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలతో పాటు పెద్దలు కూడా కాటన్ దుస్తులనే ధరించడం చాలా మంచిది.
– ప్రమాదవశాత్తు దుస్తులపై నిప్పురవ్వలు మంటలుగా వ్యాపిస్తే వెంటనే దుప్పట్లు గానీ..మందపాటి బట్టలు అంటే రగ్గులులాంటి కప్పేయండి. మంటల వల్ల ప్రమాదం జరుకుండా ఉండేందుకు అవసరమైనవాటిని దగ్గరలో ఉంచుకోండి. మంటలు వ్యాపించనప్పుడు మందపాటివి అంటే దుప్పట్లు..రగ్గుల లాంటివి కప్పడం వల్ల నిప్పుకు ఆక్సిజన్ అందదు. దీంతో మంటలు వెంటనే ఆరిపోతాయి.
– దీపావళి సమయంలో కాల్చిన క్రాకర్స్ వల్ల మీ పరిసరాల్లో ఉన్న గుడిసెపై నిప్పు పడి మంటలు వ్యాపించే ప్రమాదం ఏర్పడితే ఆర్పేందుకు నీటిని దగ్గర ఉంచుకోండి. వెంటనే ఫైర్ సర్వీసెస్‌కు ఫోను చేయండి. దానికి సంబంధించిన ఫోన్ నంబర్ ను గుర్తుపెట్టుకోండి. మీ ఫోన్ లో ఫీడ్ చేసుకోండి.
– నిప్పురవ్వలు పడి చిన్నచిన్న గాయాలు ఏర్పడితే అవి సెప్టిక్ కాకుండా ఉండేందుకు బాధ ఉపశమనానికి వెంటనే బర్నాల్, దూది, అయోడిన్, టించర్, డెట్టాల్ వంటివి అందుబాటులో ఉంచుకోండి. ఫష్ట్ ఎయిడ్ కిట్ ను అందుబాటులో ఉంచుకోవటం చాలా చాలా మంచిది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటే ఫస్ట్ ఎయిడ్ తరువాత తప్పకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లండి. పూర్తి ట్రీట్ మెంట్ చేయించుకోవడంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు.
– పిల్లల దీపావళి క్రాకర్స్ కాల్చే సమయంలో వారిని ఏమాత్రం ఒంటిరిగా వదలొద్దు. పెద్దలు పక్కనే ఉండటం చాలా చాలా అవసరం.
– బాంబులు లాంటివి పిల్లలు గానీ పెద్దలు గానీ ఎవరు కాల్చినా పసిబిడ్డలు, పిల్లల చెవుల్లో కాటన్ (దూది) పెట్టుకోవటం అస్సలు మరచిపోవద్దు. ఎందుకంటే సౌండ్ లకు కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉంది.
– వృద్ధులు..గుండె జబ్బులు ఉన్నవారు ఉంటే ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద సౌండులు వచ్చేవి కాల్చకుండా ఉండటం మంచిది. అలా వీలుకాని పక్షంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
– బాంబులు, సీరియల్‌గా ఉండే సీమటపాసులు (థౌజెంట్ వాలాలు) కాల్చుకుండా ఉండటం మంచిది.లేదా దూరంగా ఉండి కాల్చడం మంచిది. వీటిని కాల్చేటప్పుడు ఆ మార్గంలో వచ్చే పోయే వారిని గమనించి కాల్చండి. ముఖ్యంగా థౌజండ్ వాలా, 10 థౌజండ్ వాలా సీరీస్‌ను కాల్చేటప్పుడు జన సమర్థం లేకుండా చూసుకోండి. పక్కవారికి చెప్పి కాల్చండి. ఇటువంటివాటిని రేకు డబ్బాల్లో కాల్చడం ద్వారా శబ్ద కాలుష్యం సృషించవద్దు. అది కాల్చేవారికే కాదు ఎవ్వరికీ మంచిది కాదు. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలి.
– పిల్లల చేతికి రాకెట్, తారాజువ్వలు వంటివి ఇవ్వకపోవడమే మంచిది. పెద్దలు వీటిని కాల్చాలనుకుంటే పూరి గుడిసెలకు దూరంగా కాల్చడం మంచిది.
– దీపావళి రోజున తప్పని సరిగా క్రాకర్స్ కాల్చేటప్పుడు చెప్పులు వేసుకోవాలి. కాల్చి పడేసిన కాకర పువ్వొత్తుల ఇ నుప ఊచలపై గానీ..నిప్పులపై..కాల్చి పడేసిన క్రాకర్స్ సంబంధించిన వేడిగా ఉండేవాటిపై కాలు వేస్తే కాలిపోయే ప్రమాదముంది. భూ చక్రాలు వంటివి కాల్చేటప్పుడు కూడా చెప్పులు మరచిపోవద్దు. ముఖ్యంగా పసిబిడ్డల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి సంయమంలో వారిని నేలపై దించవద్దు.
– కాకర్స్ ను దీపాలకు దూరంగా పెట్టుకోవాలి. లేదంటే దీపం అంటుకున్నా..లేదా ఎగిరి వచ్చిన నిప్పు రవ్వలు క్రాకర్స్ పై పడి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కొవ్వొత్తులను, అగరు వత్తులను క్రాకర్స్ కు దగ్గరలో అస్సలు పెట్టవద్దు.
– పండుగ సమయంలో మీ వాహనాలను వీలైనంత వరకూ ఇంటి లోపలే ఉంచేలా జాగ్రర్తలు తీసుకోండి. ఆరుబైట పార్క్ చేయవద్దు.
సూచనలు
– ప్రభుత్వం నిర్దేశించిన సమయంలలో మాత్రమే దీపావళి టపాసులను కాల్చండి. గొప్పతనం కోసం ఎక్కువగా టపాసులను కొనుక్కొని వాయుకాలుష్యానికి కారణం కావద్దు.
– అత్యుత్సాహంతో పెద్ద పెద్ద సౌండ్లు వచ్చే క్రాకర్స్ కాల్చవద్దు. శబ్ద, వాయు కాలుష్యం కారణం కావద్దు. అటువంటివి పర్యావరణానికి హాని కలిగిస్తాయనే విషయం మరచి పోవద్దు. మన ఆనందం సాటి వారికి..మన జీవించే ఈ భూమికి హాని కలిగించేది ఉండకూడదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలి. పాటించాలి.
– దీపావళి వేడుకలు ప్రతీ ఒక్కరికీ ఆనందాన్ని కలిగించాలి. ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా దీపావళి వేడుకను జరుపుకోవాలి తప్ప అర్థం పర్థం లేని ఆడంబరాలకు పోయి ప్రమాదాలకు గురి కావద్దు. చిన్నపాటి తప్పిదం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీయవచ్చు. కాబట్టి దీపావళి పండుగకు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఆనందంగా ఆస్వాదించండి..అందరికీ దీపావళి శుభాకాంక్షలు..