సిరులు కురిపించే పండుగ ‘దీపావళి’

‘దీపావళి’ అంటే దీపాల వరుస అని అర్థం. తెలుగు నెలల ప్రకారంగా..అశ్వీయుజ మాసం బహుళ చతుర్దశినాడు వచ్చే పండుగ దీపావళి. దీపం అంటే వెలుగు. వెలుగు అంటే సిరి. సంపదలు కూడా. ఈ పండుగ లోకమంతా జరుపుకోవడానికి మూడు చారిత్రకాంశాలున్నాయని పురాణాలు
రాక్షసరాజైన బలిచక్రవర్తిని వామనావతారంలో వచ్చిన శ్రీవిష్ణువు పాతాళానికి అణగద్రొక్కిన దీపావళి.
శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసిన తరువాత అయోధ్య సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైన రోజు దీపావళి.
అపర పరాక్రముడైన విక్రమార్కమహారాజు..సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైన రోజు దీపావళి.
ఆశ్వీయుజ బహుళ త్రయోదశినాడు ధన త్రయోదశి. దీనినే ఉత్తరాదిన ‘ధన్‌తేరస్’గా జరుపుకుంటారు. ఆశ్వీయుజ అమావాస్య లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రం అంటే చాలా ఇష్టమైనది. దానినే దీపావళిగా ప్రసిద్ధి చెందింది. ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకునే ఈ పండుగ ప్రతీ ఇంటి దీపాల వెలుగుతో పాటు సిరులను వెలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఐదు రోజుల పండుగగా జరుపుకునే దీపావళి రోజున ఏం చేసిన ఫలిస్తుందనీ పట్టిందల్లా బంగారం అవుతుందని నమ్మతుంటారు. బంగారం అవుతుంది. మొదటి రోజున ఎవరి శక్తికి తగినట్లుగా వారు ఎంతో కొంత బంగారాన్ని కొని..ఇంటికి తెచ్చుకుంటారు. బంగారాన్ని లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా పూజిస్తారు. బంగారం ఇంటికి వచ్చిందంటే సాక్షాత్తూ, లక్ష్మీదేవి వచ్చినట్లుగా భావిస్తారు. వ్యాపారులతో పాటు అన్ని వర్గాల వారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో ఉన్న డబ్బు..బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల్నీ ఒకచోట పెట్టి దీపం వెలిగించి పూజిస్తారు. దీపం అంటే సిరి. నగల దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడుతుంటాయి. మనిషి తన జీవితం అంతా సుఖ సంపదలతో తులతూగాలని కోరుకుంటారు. ఆ ఆకాంక్షను ప్రతిరూపమే ధనత్రయోదశి. దీపాన్ని పూజించే పండుగ దీపావళి. ఇంటింటా సిరులు కురిపించే పండుగ ‘దీపావళి’.