Tulasi : శ్రీ మహావిష్ణువునే శపించిన భక్తురాలు తులసిగా మారిన కథ .. అందుకే శ్రీవారికి తులసి అంటే అంత ఇష్టం..

తులసి కేవలం మొక్క మాత్రమే కాదు. హిందు పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది. తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు.తులసి పురాణాల్లోనే కాదు వైద్య పరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క. తులసి అంటేనే పవిత్రమైనది.

Tulasi : శ్రీ మహావిష్ణువునే శపించిన భక్తురాలు తులసిగా మారిన కథ .. అందుకే శ్రీవారికి తులసి అంటే అంత ఇష్టం..

tulsi garland venkatewara

tulsi garland Sri venkatewara Swamy : తులసి కేవలం మొక్క మాత్రమే కాదు. హిందు పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది. తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు.తులసి పురాణాల్లోనే కాదు వైద్య పరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క. తులసి అంటేనే పవిత్రమైనది. తులసి పూజతో ఇల్లు సుఖ సంతోషాలతో మహిళలు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని పండిుతులు చెబుతుంటారు. తులసి ఆకులు, కాండం, వేర్లు, విత్తనాలు అన్నీ అన్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవే. ఎన్నో విశిష్టతలకు కలిగిన తులసి అంటే శ్రీ మహా విష్ణువుకు ఎంతో ఇష్టం. అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారు. తులసి మాలలు వేస్తారు.

తిరుమలలో శ్రీ వేంకటే్శ్వరుడిగా కొలువైన శ్రీ మహా విష్ణువుకు తులసి మాలలలో అలకారం చేస్తారు.తులసి ఆకులతో పూజలు చేస్తారు. తులసి అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం. మరి ఎందుకు అంత ఇష్టం తులసి అంటే..దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. శ్రీ మహా విష్ణుమూర్తి భక్తురాలు తులసిగా మారిన కథ ఎంతో ఆసక్తికంగా ఉంటుంది. శ్రీ మహా విష్ణువును తన భక్తురాలే తనను శంపించిన కథ తులసి ఆవిర్భావం వెనుక ఉన్న ఆ కథేంటో తెలుసుకుందాం..

Diamond Ganesh : సహజ సిద్ధంగా ఏర్పడిన వజ్ర గణపతి .. ఏడాదికి ఒకసారే దర్శనం

తులసి దళానికి లొంగిపోయిన శ్రీ మహా విష్ణువు..
తులసి కేవలం మొక్క మాత్రమే కాదు.. అదొక ఆధ్యాత్మిక వృక్షం. వైష్ణవ భక్తులు తులసి మాలలు ధరిస్తారు. తులసి పూజించకుంటే పూజ సఫలీకృతం కాదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక శ్రీకృష్ణుడి తులాభారం కథను పూర్తి మలుపు తిప్పింది కూడా తులసీ దళమే(తులసి ఆకు). మణులు, మాణిక్యాలు, బంగారం, వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయన తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు. కానీ ఒక్క తులసి ఆకు వేయగానే ఆ శ్రీ మహా విష్ణువు ఆ తులసి దళానికి సరిసమానంగా సరితూగాడు. అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక్క తులసి ఆకుకు సమానం అని శ్రీకృష్ణ తులాభారం చెబుతోంది. భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలా కరుణించి వరాలు కురిపిస్తాడాయన. తులసికి అంతటి విశేషం ఉందిమరి.

భక్తురాలే తులసిగా మారిన కథ..
వృందా అనే అమ్మాయి చాలా అందమైనది. అణకువ కలిగిన అమ్మాయి. ఆమె కాలనేమి అనే రాక్షసుడి కూతురు. ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం. ఆయకు పూజ చేయనిదే పచ్చి గంగ అయినా ముట్టేది కాదు. నిత్యం విష్ణు ఆరాధనలోనే మునిగిపోయేది. అటువంటి ఉత్తమురాలికి జలంథర్ అనే యువకుడితో వివాహం జరిగింది. పరమ త్రినేతుడు (శివుడు) మూడో కన్ను నుంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలంధరుడు. అమిత శక్తివంతుడు. జలంధరుడు వృందను ఇష్టపడ్డాడు.

శివాగ్నిలో పుట్టి జలంధరుడిగా మారిన కథ..
ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్నిని శివుడు గంగా సాగరంలో దాచిపెట్టాడు. ఆ అగ్నిబాలుడి రూపం ధరించాడు సముద్రుడు. తరువాత ఆ బాలుడ్ని బ్రహ్మకు అప్పగించాడు. ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకోగానే కంటినుండి నీరు వచ్చిందట. అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరుపెట్టాడు. అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధుడిగా మారాడు. అలాగే నిన్ను వుడు తప్ప మరెవర్వరు చంపలేరని వరమిచ్చాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధరుడు రాక్షస రాజు అయ్యాడు. దేవతలపై తన ప్రతాపంతో విరుచుపడేవాడు.

Ganesh Chaturthi 2023 : గ‌రిక అంటే గ‌ణేశుడికి ఎందుకంత ఇష్టం? గడ్డిపోచకూ గణనాధుడికి ఉన్న బంధమేంటీ..?

ఇదిలా ఉంటే ఓ సందర్భంగా వృందను చూసిన జలంధరుడు ఆమెపై మనస్సుపారేసుకున్నాడు. మహావిష్ణువుకు భక్తురాలైన ఆమెను విధివశాత్తు వృందాకు జలంధర్ కు వివాహం జరుగింది. ఆమెతో వివాహం భక్తి, పవిత్రతతో అతని శక్తి మరింత పెరిగిపోయింది. దీంతో శివాగ్నిలోంచి పుట్టినవాడే అయినా శివుడిని కూడా ఓడించగలననే గర్వం పెరిగిపోయింది. శివుడినే ఓడించాలనుకున్నాడు అదే అహంకారంతో. శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దరు హోరాహోరీగా పోరాడుతుంటారు. అది చూసిన దేవతలు హడలిపోతారు. జలంధర్ శక్తిసామర్ధాలకు హడిలిపోయిన దేవతలు విష్ణువుకు మొరపెట్టుకుంటాడు.

ఇంకేముంది రంగంలోకి దిగుతాడు విష్ణుమూర్తి. దుష్ణ శిక్షణ..శిక్ష రక్షణ కోసం లోక కల్యాణం కోసం ఎన్నో చేసిన ఆయన జలంధరుడి అంతం కోసం రంగంలోకి దిగక తప్పలేదు.కానీ జలంధరుడి భార్య వృంద తన భక్తురాలు. భక్తురాలి భర్తను ఎలా చంపాలి అని సందిగ్ధ పడ్డాడు. కానీ తప్పదు. జలంధర్ వల్ల దేవతలు పీడింపబడుతున్నారు. దుష్ణ శిక్షణ..శిక్ష రక్షణ కోసం చేయకూడని పనికి పూనుకుంటాడు.

శ్రీ మహా విష్ణువునే శపించిన భక్తురాలు..
జలంధర్ శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్తాడు. మహా విష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది. ఆమె పాతివ్రత్యం అంత గొప్పది. పాతివ్రత్యం భంగం కావటంతో జలంధర్ శక్తి సన్నగిల్లుతుంటుంది. మరో పక్క తను ఆరాధించిన మహావిష్ణువే తనని మాయ చేశాడని బాధపడుతుంది. తన ఆరాధ్యదైవమైన విష్ణువుపై కోప్పడుతుంది. తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృంద మహావిష్ణువును శపిస్తుంది.

అమె మహా పతివ్రత. దీంతో ఆమె శాపనార్థం సాక్షత్తు మహావిష్ణువుపై పనిచేస్తుంది. ఆమె శాపానికి గురైన విష్ణువు గండకి నది సమీపంలో సాలిగ్రామ శిలగా మారుతాడు. అందుకే గండకీ నదిలో శాలిగ్రామ శిలల్ని సాక్షాత్తు శ్రీ మహా విష్ణువుగా కొలుస్తారు. ఆ శాలిగ్రామాల్లో విష్ణు చక్రం. సూర్యుడు రూపాల్లో ఉంటాయి.

ఇదిలా ఉంటే శివుడితో యుద్ధం చేస్తున్న జలంధర్ శక్తి తగ్గిపోవటంతో మహాశివుడి అస్త్రాలకు హతుడవుతాడు. భర్త మరణించాడని తెలుసుకున్న వృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది. అలా తన జీవితాన్ని ముగించుకోవాలనకుంటుంది. వృంద తనువు చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు. నువ్వు చాలా గొప్పదానమ్మా..నిన్ను భూలోకంలోనే కాదు దేవతలు కూడా కొలుస్తారు..సౌభాగ్యాలను సిద్ధంగా దొప్పదానివిగా పూజలందుకుంటావని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటుందని వరం ఇస్తాడు. ఇందుకే తులసి లేకుండా విష్ణువుకు ఏ పూజ చేసినా ఫలితం ఉండదనే నానుడి ఉంది. అందుకే ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉంటూ పూజలు అందుకుంటుంది.