జమ్మిచెట్టుని పూజిస్తే విజయాలన్నీ మీవే

భారతదేశంలో చేసుకునే ఎన్నో పండుగలు ప్రకృతితో మమేకమై ఉంటాయి. చెట్లు, మొక్కలను పూజిస్తుంటారు. ఆ పండుగల్లో దసర. దీన్ని తెలంగాణ ప్రాంతంలో బతుక్మ పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగలో జమ్మి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. దీన్నే శమీ వృక్షం అనీ అంటారు. దసరా రోజున జమ్మిచెట్టును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయంటారు.
ద్వాపరయుగంలో జమ్మి ప్రాధాన్యత
ముళ్లు కలిగి ఉన్న జమ్మిచెట్టు మీదనే పాండవులు అజ్నాత వాసానికి వెళ్లే సమయంలో వారి ఆయుధాలను ఈ చెట్టుమీదనే భద్రపరిచారు. వాటిని తిరిగి దసరా పండుగ రోజునే తీసుకున్నారు. విజయ దశమి రోజున జమ్మిచెట్టును పాంటవులు పూజించి విజయాన్ని ప్రసాదించమని ప్రార్థించారట. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను పాండవులు ఓడించి రాజ్యాన్ని తిరిగి సాధించుకున్నారు.
రామాయణంలో జమ్మిచెట్టు
శ్రీరాముడు వనవాసంలో జమ్మిచెట్టు నీడనే రాముడు విశ్రమించాడనీ అంటారు. త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమినాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతోంది.
ఆయుర్వేదంలో జమ్మి చెట్టు
ఆయుర్వేద వైద్యంలో జమ్మిచెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. జమ్మి ఆకులు, చెట్టు బెరడు, పువ్వులు, విత్తనాలు ఇలా అన్నీ వైద్యానికి ఉపయోగపడతాయి. భయంకరమైన కుష్టు రోగ నివారణకు, అవాంఛిత రోమాల నివారణకు జమ్మి ఆకులను ఉపయోగిస్తారని ఆయుర్వేదంలో ఉంది.
సర్వ పాపాలను తొలగించే చెట్టు
జమ్మి చెట్టును సర్వ పాపాలను తొలగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. జమ్మి చెట్టు విజయానికి సంకేతమని, విజయదశమి రోజున ఆ చెట్టుని పూజిస్తే ఎంతటి సమస్యలైనా తొలగిపోతాయి. ద్వాపర యుగంలో పాండవులకు త్రేతాయుగంలో శ్రీరాముడికి జమ్మి చెట్టుని పూజించటం వల్లనే విజయాలు సిద్ధించాయని పురాణ కథల్లో ఉంది. ఈ చెట్టుని పూజిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు జరిగి విజయం చేకూరుతుందంటారు వేద పండితులు.