Tirumala : జూన్ 11 నుంచి భ‌క్తుల‌కు అందుబాటులో జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు

తిరుమలలో జూన్ 12 నుంచి 14వతేదీ వరకు మూడు రోజులపాటు జరిగే జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు తిరుమలలో కరం0ట్ బుకింగ్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది.

Tirumala : జూన్ 11 నుంచి భ‌క్తుల‌కు అందుబాటులో జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు

Jeyshtabhishekam

Updated On : June 10, 2022 / 9:22 PM IST

Tirumala :  తిరుమలలో జూన్ 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు తిరుమలలో కరం0ట్ బుకింగ్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది.

రోజుకు 600 టికెట్ల చొప్పున విడుద‌ల చేస్తారు. ఒక్కో టికెట్ ధ‌ర రూ.400/-గా నిర్ణ‌యించారు. సిఆర్వో కార్యాల‌యానికి ఎదురుగా ఉన్న కౌంటర్‌లో భ‌క్తుల ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ తీసుకుని టికెట్లు జారీ చేస్తారు. సేవ‌కు ఒక రోజు ముందుగా మొద‌ట వ‌చ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన టికెట్లు మంజూరు చేస్తారు.

ఒక చిన్న లడ్డూ ప్రసాదంగా అంద‌జేస్తారు. సేవా టికెట్లు పొందిన భ‌క్తులు ఉద‌యం 8 గంట‌ల‌కు రిపోర్టు చేయాలి. ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో గ‌ల కల్యాణోత్సవ మండపంలో జ్యేష్టాభిషేకం జ‌రుగుతుంది. సేవ అనంత‌రం భ‌క్తుల‌ను మహా లఘుద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

Also Read : Nayanthara Vignesh Shivan Slippers : నయనతార దంపతులపై టీటీడీ సీరియస్.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ప్రకటన