Kedarnath Temple : శీతాకాలం దృష్ట్యా కేదార్ నాథ్ ఆలయం మూసివేత

శీతాకాలమంతా ఈ ఆలయాన్ని మూసి వేస్తామని బద్రినాథ్- కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ పేర్కొన్నారు. ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత కేదార్ నాథుని పంచముఖి డోలిని పూజారులు భజంపై మోసుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లి ఉభీమఠ్ లోని ఓంకారేశ్వర ఆలయంలో భద్రపరిచారు.

Kedarnath Temple : శీతాకాలం దృష్ట్యా కేదార్ నాథ్ ఆలయం మూసివేత

Kedarnath temple closed

Updated On : November 16, 2023 / 9:18 AM IST

Kedarnath Temple Closed : ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయం మూతపడింది. శీతాకాలం దృష్ట్యా కేదార్ నాథ్ ఆలయ మహా ద్వారాన్ని భయ్యా దూజ్ సందర్భంగా బుధవారం మూసివేశారు. ఈ ఆలయం శీతాకాలమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. తెల్లవారుజామునే చలిలో వేలాదిగా భక్తులు ఆలయానికి చేరుకోగా, పూజారులు శివుడికి పూజలు, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 8.30 గంటలకు మహా ద్వారాలను మూసివేశారు.

ఆరు నెలలపాటు ఆలయం తలుపులు మూసివుంటాయి. శీతాకాలమంతా ఈ ఆలయాన్ని మూసి వేస్తామని బద్రినాథ్- కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ పేర్కొన్నారు. ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత కేదార్ నాథుని పంచముఖి డోలిని పూజారులు భజంపై మోసుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లి ఉభీమఠ్ లోని ఓంకారేశ్వర ఆలయంలో భద్రపరిచారు.

Gold Rate Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?

శీతాకాలమంతా స్వామివారికి అక్కడే పూజలు నిర్వహిస్తారు. మరోవైపు ఈ సీజన్ లో కేదార్ నాథుడికి 19.5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ వెల్లడించారు.