Mahakumbh Mela 2025 : ఆధ్యాత్మిక జాతరకు రెడీ.. 12ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళాకు కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు..
ఈ మహాకుంభ్ కు 6వేల 300 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అవుతుందని అంచనా వేసిన యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే 5వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది.

Special Story On Maha Kumbh Mela Prayagraj
Mahakumbh Mela 2025 : స్వర్గమే భూలోకానికి దిగి రాబోతోంది. సకల దేవతలకు ఆహ్వానం పలికేందుకు పవిత్ర భూమి ప్రయాగ్ రాజ్ ముస్తాబవుతోంది. 101 దేవతల ఆశీర్వాదం పొందేందుకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మహా జాతరకు హైటెక్ టెక్నాలజీతో హై లెవెల్ అరేంజ్ మెంట్స్ జరుగుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంబరం. యావత్ దునియాలోనే కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే మహా వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. మరో 10 రోజుల్లో మొదలు కానున్న మహా కుంభమేళా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి. మహా కుంభ్ కోసం యూపీ సర్కార్ ఒక ఆధ్యాత్మిక నగరిని నిర్మిస్తోందా?
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంబురం..
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంబురం. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసే హెడ్ కౌంట్ నమోదయ్యే జన జాతర. మహా కుంభమేళాకు సమయం ఆసన్నమవుతోంది. 12 ఏళ్లకు ఓసారి జరిగే మహా మహోత్సవం ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుంది. అందుకోసం యూపీలోని ప్రయాగ్ రాజ్ సర్వం సిద్ధమవుతోంది.
Also Read : చైనాలో విజృంభిస్తోన్న HMPV వైరస్.. కోవిడ్ మహమ్మారి 2.0గా మారబోతుందా? ఈ 11 వ్యాధులపై వైద్యుల హెచ్చరిక!
45 రోజుల పాటు జరగబోతున్న హిందుత్వ వేడుకకు భారీ ఏర్పాట్లు..
45 రోజుల పాటు జరగబోతున్న హిందుత్వ వేడుకకు హైటెక్ టెక్నాలజీతో ఓ రేంజ్ లో అరేంజ్ మెంట్స్ చేస్తోంది యోగి సర్కార్. కొత్త ఏడాదిలో జరగబోయే ఈ మెగా ఈవెంట్ ను చరిత్రలో నిలిచిపోయే ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది ప్రభుత్వం.
మహా కుంభమేళా కోసం ప్రయాగ్ రాజ్ లో ప్రత్యేక ఆధ్యాత్మిక నగరినే నిర్మిస్తోంది యూపీ సర్కార్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రతిదాంట్లో చాలా కేర్ తీసుకుంటోంది. ఎక్కడా ఏ చిన్న ప్రాబ్లమ్ రాకుండా అధికార యంత్రాంగం మొత్తం ప్రయాగ్ రాజ్ నుంచే వర్క్ చేస్తోంది.
మహా కుంభమేళా కోసం 6వేల 300 కోట్ల రూపాయల బడ్జెట్..
మహా కుంభమేళా కోసం దాదాపు 4వేల హెక్టార్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహాకుంభ్ కు 6వేల 300 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అవుతుందని అంచనా వేసిన యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే 5వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది.
Also Read : చైనాను వణికిస్తోన్న హెచ్ఎంపీవీ.. ఇది కొత్త వైరస్ కాదా? కోవిడ్-19 పోలి ఉందా? ఏదైనా వ్యాక్సిన్ ఉందా?!