Mahashivratri 2023 : శివుడికి ఇష్టమైన ద్రవ్యాలు..ఐశ్వర్యపాప్తి కలిగించే అభిషేకాలివే..

పరమశివుడు అభిషేక ప్రియుడు అంటారు. అటువంటి పరమశిడిని ఎటువంటి ద్రవ్యాలతో పూజిస్తే ఎటువంటి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం..ఆ ద్రవ్యాలు ఏమిటి? ఆ ద్రవ్యాలతో అభిషేకరిస్తే ఎటువంటి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం..

Mahashivratri 2023 : శివుడికి ఇష్టమైన ద్రవ్యాలు..ఐశ్వర్యపాప్తి కలిగించే అభిషేకాలివే..

benefits of performing lord shiva abhishekam with different items

Updated On : February 17, 2023 / 5:07 PM IST

Mahashivratri 2023 : శ్రీ మహా విష్ణువు అలంకార ప్రియుడు..పరమశివుడు అభిషేక ప్రియుడు అంటారు. అటువంటి పరమశిడిని ఎటువంటి ద్రవ్యాలతో పూజిస్తే ఎటువంటి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం..ఆ ద్రవ్యాలు ఏమిటి? ఆ ద్రవ్యాలతో అభిషేకరిస్తే ఎటువంటి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం..

మనస్సు నిండా భక్తితో ఉద్ధరిణెడు జలంతో అభిషేకించినా శంకరుడు సంతసిస్తాడు. కోరిన కోరికలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు అయ్యాడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేకతలున్నాయి. పరమార్ధాలు ఉన్నాయి..

శివానుగ్రహం పొందటానికి మన పెద్దలు అటువంటి అరుదైన విషయాలను ప్రాచీన గ్రంథాలలో పొందుపరిచారు. శివుడ్ని ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం వస్తుందో తెలుసుకుని పూజిద్దాం..శివానుగ్రహ పొందుదాం..అవేవో తెలుసుకుందాం..

ద్రవ్యాలు..అనుగ్రహాలు..
ఆవు పాలతో….. సర్వ సౌఖ్యాలు
ఆవు పెరుగు… ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి…. ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార) …. దుఃఖ నాశనం, ఆకర్షణ
తేనె .. తేజో వృద్ధి
భస్మ జలం.. మహా పాప హరణం
సుగంధోదకం … పుత్ర లాభం
పుష్పోదకం… భూలాభం
బిల్వ జలం … భోగ భాగ్యాలు
నువ్వుల నూనె… అపమృత్యు హరణం
రుద్రాక్షోదకం … మహా ఐశ్వర్యం
సువర్ణ జలం … దరిద్ర నాశనం
అన్నాభిషేకం .. సుఖ జీవనం
ద్రాక్ష రసం …. సకల కార్యాభివృద్ధి