Old City Bonalu : ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

ప్రతి ఏటా హైదరాబాద్‌లో జరిగే ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

Old City Bonalu : ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

Talasani Srinivas Yadav

Updated On : July 7, 2022 / 2:32 PM IST

Old City Bonalu : ప్రతి ఏటా హైదరాబాద్‌లో జరిగే ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈరోజు ఆయన హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాల పాటు బోనాలు నిర్వహించుకోలేక పోయామని…..ఈ నెల 17 న సికింద్రాబాద్ మహంకాళి, 24 న ఓల్డ్ సిటీ బోనాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరిగాయని  చెప్పారు.  18 న మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు, 25న ఉమ్మడి దేవాలయాల అంబారీ ఊరేగింపు జరుగుతుందని మంత్రి చెప్పారు.

ప్రధాన దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తలసాని చెప్పారు. చార్మినార్ వద్ద 500 మంది కళాకారులతో కళా ప్రదర్శనలు  ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో కంటే భక్తులు అధికంగా వస్తారనే సమాచారంతో శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు సిబ్బందిచో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

Also Read : Punjab: నిరాడంబ‌రంగా జ‌రిగిన సీఎం భగవంత్ మాన్​ పెళ్లి.. కుటుంబంతో కేజ్రీవాల్ హాజ‌రు