Kadambari Jethwani: ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న ముంబయి నటి జెత్వాని
దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ముంబయి నటి కాదంబరి జెత్వానీ దర్శించుకున్నారు.

Kadambari Jethwani
Jethwani Visits Vijayawada Kanaka Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ (ఆదివారం) శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలాఉంటే.. దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ముంబయి నటి కాదంబరి జెత్వానీ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఇంద్రకీలాద్రిపైకి వచ్చిన నటి కాదంబరి జెత్వానీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా అమ్మవారి ఉత్సవాలు జరగాలి.. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కేసు విషయంపై ప్రశ్నించగా.. ఇక్కడ కేసు గురించి మాట్లాడనని జెత్వాని బదులిచ్చారు.