Equality Statue : అమోఘం..అద్భుతం..అద్వితీయం, సహస్రాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం
విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి యాగశాల నుంచి రుత్విజులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ప్రధాన యాగశాలలో దివ్యదేశాల్లో ప్రతిష్టించాల్సిన 33

Chinna Jeeyar
Ramanuja Sahasrabdi Utsavalu : అమోఘం…అద్భుతం..అద్వితీయం….కమనీయం…ముచ్చింతల్ మహాక్షేత్రంలో జరుగుతున్న శ్రీ భగవ్రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల గురించి ప్రజలు అనుకుంటున్న మాటలివి. అవును ముచ్చింతల్ ప్రాంతంలో జరుగుతున్న మహోత్తర కార్యక్రమం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. అక్కడ జరుగుతున్న పూజలు చూస్తూ తన్మయత్వానికి లోనవుతున్నారు. హోమ గంధాల సువాసనలు వ్యాపిస్తున్నాయి. రామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్విఘ్నంగా, నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న ఉత్సవాలు ఆరోరోజు సోమవారం ఘనంగా మొదలయ్యాయి. ఉత్సవాలు మొదలైన తర్వాతిరోజు నుంచి జరుగుతున్న శ్రీ లక్ష్మీ నారాయణ మహాయజ్ఞాలతో ఆశ్రమం ఆవరణలో ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. 114 యాగశాలల్లో పూర్తి శాస్త్రోక్తంగా జరుగుతున్న యజ్ఞాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 2022, ఫిబ్రవరి 07వ తేదీ సోమవారం ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం జరిగింది. 108 దివ్యదేశాల్లోని 33 ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట ఘనంగా జరిగింది. యజ్ఞ, యాగాదులు, అష్టాక్షరీ మంత్ర పఠనం మధ్య ఉత్సవ విగ్రహాలు అత్యంత శక్తిమంతంగా మారతాయి.
Read More : Srikakulam : రథసప్తమి ఉత్సవాలు.. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం
విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి యాగశాల నుంచి రుత్విజులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ప్రధాన యాగశాలలో దివ్యదేశాల్లో ప్రతిష్టించాల్సిన 33 ఉత్సవ విగ్రహాలతో పెరుమాళ్లస్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఓం నమోనారాయణాయ అష్టాక్షరీ మంత్ర పఠనంతో సోమవారం ఉదయం ఆరున్నర గంటలకు వేడుకలు మొదలయ్యాయి. ప్రధాన యాగశాలలో అష్టాక్షరీ మంత్ర పఠనం జరిగింది. అనంతరం శ్రీ పెరుమాళ్ ప్రాతఃకాల ఆరాధన పూర్తయింది. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞహోమం జరిగింది. ఇష్టిశాలలో దృష్టి దోష నివారణకు వైయ్యూహికేష్టియాగం, సుదర్శనేష్టియాగం నిర్వహిస్తారు. ప్రవచన మండపంలో శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ జరుపుతారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞ హోమం జరుపుతారు. రాత్రి 9గంటలకు పూర్ణాహుతి ఉంటుంది.