Ratha Saptami Arasavalli : వైభవంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవం

తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. అర్ధరాత్రి తరువాత రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. నిత్యపూజలు అందుకుంటున్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో..

Ratha Saptami Arasavalli : వైభవంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవం

Ratha Saptami Arasavalli

Updated On : February 8, 2022 / 12:06 AM IST

Ratha Saptami Arasavalli : శ్రీకాకుళం జిల్లాలో అర్థరాత్రి నుంచి అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవం ప్రారంభమైంది. అర్థరాత్రి 12 గంటల 15 నిమిషాలకు ప్రారంభమైన క్షీరాభిషేక మహోత్సవం 8వ తేదీ ఉదయం 7 గంటల వరకు జరుగుతుంది. అనంతరం విశేష అర్చనలు, ద్వాదశ హారతి, మహా నివేదన, పుష్పాలంకరణ సేవలు ఉంటాయి. 8వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనం భక్తులకు కనువిందు చేయనుంది.

సాయంత్రం 6 గంటలకు విశేష అర్చన ఉంటుంది. 8వ తేదీ రాత్రి 11 గంటల నుండి స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. రథసప్తమి ఉత్సవాన్ని పురస్కరించుకుని 600 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. 32 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 80 ఫీట్ రోడ్డులో భక్తులకు పార్కింగ్ సదుపాయం కల్పించారు.

Brisk Walk : వేగవంతమైన నడకతో….. గుండె ఆరోగ్యం మెరుగు

తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. అర్ధరాత్రి తరువాత రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. నిత్యపూజలు అందుకుంటున్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈసారి కోవిడ్ ఆంక్షల మధ్యే రథ సప్తమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు.

అర్ధరాత్రి తర్వాత స్వామివారి జయంతి ఉత్సవానికి అంకురార్పణ చేశారు. ముందుగా వేదపారాయణతో ఆదిత్యుని మూల విరాట్టుకు క్షీరాభిషేకం నిర్వహించి త్రిచ, సౌరం, అరుణం, నమకం, చమకాలతో అభిషేకం నిర్వహించనున్నారు వేద పండితులు.

అనంతరం నదీ జలాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి సుప్రభాతం, నిత్యార్ఛన, ద్వాదశి అర్చనలతో స్వామివారికి ప్రత్యేక సేవలు చేస్తారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం సాక్షాత్కరించనుంది. అనంతరం పుష్పాలంకరణ సేవ నిర్వహిస్తారు. మంగళవారం రాత్రి ఏకాంత సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. రథ సప్తమి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. వేడుకలకు లక్ష మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశారు.

Facebook: ఫేస్‌బుక్‌కి రూ.1500కోట్ల జరిమానా.. ఎందుకంటే?

కోవిడ్ నేపధ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. క్యూ లైన్స్, థర్మల్ స్కాన్, శానిటైజర్లు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. 32 సీసీ కెమెరాలతో ఆర్డీవో, డీఎస్పీ ఆద్వర్యంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ట్రాఫిక్‌ను మూడు రూట్లుగా విభజించారు. నరసన్న పేట నుంచి వచ్చే భక్తులు రామలక్ష్మణ జంక్షన్ నుంచి సంతోషి మాత టెంపుల్ మీదుగా రావాలని సూచించారు. నవ భారరత్ నుంచి వచ్చే వారు ఏడు రోడ్ల జంక్షన్ మీదుగా, గార వైపు నుంచి వచ్చే వాహనాలను రెడ్డి పేట దగ్గర పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.