Tirumala : వారికి మాత్రమే…ఇతరులు తిరుమలకు రావొద్దు

ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుండడంపై టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇతర ప్రాంతాల వారు సర్వదర్శనం టోకెన్లకు తిరుపతికి రావొద్దని సూచించారు.

Tirumala : వారికి మాత్రమే…ఇతరులు తిరుమలకు రావొద్దు

Tirumala

Updated On : September 11, 2021 / 8:28 PM IST

Sarva Darshan Tokens : టీటీడీ కొన్ని రోజుల క్రితం తాత్కాలికంగా నిలిపివేసిన సర్వదర్శనం టోకెన్లను అధికారులు పునరుద్ధరించారు. దీంతో భక్తులు టోకెన్లు తీసుకొనేందుకు భారీగా పోటెత్తుతున్నారు. అయితే..ప్రయోగాత్మకంగా కేవలం చిత్తూరు వాసులకు మాత్రమే ఈ అవకాశం కల్పించారు. అయినా..ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుండడంపై టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇతర ప్రాంతాల వారు సర్వదర్శనం టోకెన్లకు తిరుపతికి రావొద్దని సూచించారు.

Read More : Thirumala : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల కోసం భారీగా తరలివచ్చిన భక్తులు

తిరుపతిలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ లో చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టోకెన్లను జారీ చేయడం జరుగుతోందని వివరించారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు తిరుపతికి వచ్చి నిరాశగా వెనుదిరుగుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. సో..ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు టీటీడీకి సహకరించాలని కోరారు. సుదీర్ఘ విరామం తర్వాత తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు జారీ చేసింది టీటీడీ.

Read More : TTD : సర్వ దర్శనం టోకెన్ల జారీ..చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో..తిరుపతి శ్రీనివాసంలో సర్వ దర్శనం టోకెట్లు జారీ చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన టోకెన్లను రోజుకు రెండు వేల చొప్పున ఇస్తారు. అది కూడా ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా వాసులకు అనుమతి ఇస్తారు. కోవిడ్ సెకండ్‌ వేవ్‌తో ఏప్రిల్‌ 12 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది టీటీడీ.దాదాపు 5 నెలలకు మళ్లీ సర్వ దర్శనాలకు భక్తులను అనుమతిస్తోంది. గతంలో రోజుకు 8 వేల సర్వదర్శన టోకెన్లను జారీ చేసేది టీటీడీ. ఇప్పుడు రెండు వేలకే పరిమితం చేసింది. మరికొన్ని రోజుల తర్వాత అందరు భక్తులకూ సర్వదర్శనం కల్పించే అవకాశాలున్నాయి.

Read More : Sarvadarshanam : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-సర్వదర్శనం టోకెన్లు జారీ

6 గంటలకు ప్రయోగాత్మకంగా టోకెన్ల జారీ చేపట్టిన టీటీడీ అధికారులు..కోవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  కోవిడ్ సెకండ్‌ వేవ్ వ్యాప్తి తగ్గాక ఇంతవరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీచేస్తూ వస్తోంది టీటీడీ.తొలుత 5 వేల మందికే అనుమతి ఇచ్చినా.. తర్వాత కాలంలో 8 వేల మందికి పెంచారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, వర్చువల్ ఆర్జిత సేవల ద్వారా 20 వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సర్వ దర్శనాలకు అనుమతి ఇస్తామని…రెండోసారి టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన హామీ మేరకు.. టీటీడీ రెండు వేల మందికి అనుమతి ఇచ్చినా..ఇతర జిల్లాల నుంచి వారికి కూడా సర్వదర్శనం టికెట్లు ఇవ్వవచ్చని తెలుస్తోంది.