Jwala Thoranam : శ్రీశైలంలో జ్వాలాతోరణం..నేత్రపర్వం

శ్రీశైలంలో జ్వాలాతోరణం నేత్రపర్వంగా సాగింది. ప్రధానాలయ రాజగోపుర వీధిలో గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణాన్ని వెలిగించారు.

Jwala Thoranam : శ్రీశైలంలో జ్వాలాతోరణం..నేత్రపర్వం

Srisailam

Updated On : November 19, 2021 / 1:07 PM IST

Srisailam Jwala Thoranam : శ్రీశైలంలో జ్వాలాతోరణం నేత్రపర్వంగా సాగింది. ప్రధానాలయ రాజగోపుర వీధిలో గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణాన్ని వెలిగించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో తీసుకువచ్చి దీపప్రజ్వలన కార్యక్రమాన్ని జరిపించారు. అంతకు ముందు జ్వాలాతోరణానికి ఉపయోగించే వొత్తులను ఈవో లవన్న ఆధ్వర్యంలో స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. నూలు పోగువొత్తులను ప్రకాశం జిల్లా వేటపాలం మండలం ఆమోదగిరిపట్నంకి చెందిన వసుందరరావు కుటుంబీకులు అప్పగించారు.

Read More : Rakesh Tikait : వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ లో రద్దు చేశాకే ఆందోళనలు ముగిస్తాం : రాకేష్ టికాయత్

ఈ జ్వాలాతోరణోత్సవాన్ని తిలకించి భస్మాన్ని నుదుటిన ధరించడంతో సకల గ్రహపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఉభయ తెలుగు రాష్ర్టాలతోపాటు ఉత్తర దక్షిణాది రాష్ర్టాల నుంచి యాత్రికులతో క్షేత్ర పురవీధులు సందడిగా మారాయి. శ్రీశైల మహా క్షేత్రంలో భక్తులతో కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శనానికి తరలివచ్చారు. శ్రీశైల మహాక్షేత్రానికి పరివార దేవత ఇష్టకామేశ్వరీ అమ్మవారి ఆలయ దర్శనాలు పునః ప్రారంభమయ్యాయి. క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువై చెంచుల ఆరాధ్య ధైవంగా కొలుస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి దీపోత్సవం ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.