Srisailam: ఆగష్టు 18నుంచి శ్రీ శైల స్వామి వారి స్పర్శ దర్శనానికి అనుమతి
ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీ శైలంలో ఆగష్టు 18నుంచి స్వామి స్పర్శ దర్శనానికి అనుమతులిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. పలు విడతలుగా పూజలు..

Srisailam Darshanam (1) (1)
Srisailam: ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీ శైలంలో ఆగష్టు 18నుంచి స్వామి స్పర్శ దర్శనానికి అనుమతులిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. పలు విడతలుగా పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గర్భాలయంలో ఏడు విడతలుగా.. సామూహిక అభిషేకాలు నాలుగు విడతలుగా చేయనున్నారు.
గతంలో మాదిరిగా బ్రేక్ దర్శనం మూడు విడతలుగానే ఉంటుందని అన్నారు. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా వేదాశీర్వచనాలు, నవావరణ పూజలు పునరుద్ధరించనున్నట్లు స్పష్టం చేశారు.