Tirumala Agarabattis : సెప్టెంబర్ 13 నుంచి శ్రీవారి అగరబత్తిలు అమ్మకం ప్రారంభం
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేసిన అగరబత్తీలను సెప్టెంబర్ 13 నుంచి విక్రయించబోతున్నారు.

Ttd Agarabattis
Tirumala Agarabattis : శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరోక ప్రోడక్ట్ ను తీసుకు వస్తోంది. టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేసిన అగరబత్తీలను సెప్టెంబర్ 13 నుంచి విక్రయించబోతున్నారు. టీటీడీకి చెందిన వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో ఏడుకొండలకు గుర్తుగా ఏడు బ్రాండ్లతో ఈ అగరబత్తీలను తయారుచేశారు. లాభాపేక్ష లేకుండా బెంగుళూరుకు చెందిన దర్శన్ సంస్ధ ఈ అగరబత్తీలను తయారు చేస్తోంది.
1.అభయహస్త
2. తందనాన
3. దివ్యపాద
4. ఆకృష్టి
5. సృష్టి
6. తుష్టి
7 దృష్టి పేర్లతో తయారైన అగరబత్తీలను మొదట తిరుమలలోని లడ్డూ కౌంటర్లవద్ద, తిరుపతిలోనూ విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది.