Dhanteras 2024: ధన త్రయోదశిని ఎందుకు జరుపుకుంటారు.. దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..

ధనత్రయోదశిని దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తరాధి ప్రజలు ఎక్కువగా జరుపుకుంటారు. ఇటీవలి కాలంలో దక్షిణాది ప్రాంతాల్లోనూ ..

Dhanteras 2024: ధన త్రయోదశిని ఎందుకు జరుపుకుంటారు.. దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..

Dhanteras 2024

Updated On : October 26, 2024 / 1:42 PM IST

Dhanteras 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం.. దీపావళి పండుగ ప్రారంభం ముందు వచ్చే త్రయోదశి రోజున ధనత్రయోదశి (ధన్‌తేరస్) పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రజలు అక్టోబర్ 29న (మంగళవారం) పండుగను జరుపుకోనున్నారు. ఆరోజు ప్రజలు ఆయుర్వేద దేవుడైన ధన్వంతరిని, సంపద, శ్రేయస్సు కలిగించే దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు. ‘ధన్’ సంపదను సూచిస్తుంది. ‘తేరాస్’ కృష్ణపక్షంలోని పదమూడవ రోజును సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం.. ఈ పండుగ రోజు లక్ష్మీదేవి, కుబేరుని స్వాగతించే ప్రయత్నంలో బంగారం, వెండి ఆభరణాలు, పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి శుభదినంగా పరిగణిస్తారు. పెద్దెత్తున కొనుగోళ్లు చేయడం వల్ల సంపద, శ్రేయస్సు విషయాల్లో అదృష్టాన్ని పొందుతామని నమ్ముతారు.

Also Read: దీపావళి పండుగ విశిష్టత ఏంటి? ఏ రోజున జరుపుకుంటారు? లక్ష్మీపూజ ఎందుకు చేస్తారంటే..

ధనత్రయోదశిని దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తరాధి ప్రజలు ఎక్కువగా జరుపుకుంటారు. ఇటీవలి కాలంలో దక్షిణాది ప్రాంతాల్లోనూ ఈ ధనత్రయోదశిని నిర్వహిస్తున్నారు. పండుగరోజు తమ శక్తి కొలది బంగారం కొనుగోలు చేసి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తుంటారు. వినాయకుడు, లక్ష్మీదేవి, కుబేరుడి బొమ్మలు కొత్తవి కొనుగోలు చేసి పూజించడాన్ని శుభప్రదంగా భావిస్తారు.

Also Read: బ్యాంకులకు దీపావళి సెలవులు ఎప్పుడు? ఎన్ని రోజులు ఉన్నాయి? ఏపీ, తెలంగాణలో దీపావళి హాలీడే ఎప్పుడంటే..

‘ధంతేరస్’ను హిందూ పురాణాలు, సంప్రదాయాలలో అనేక కారణాల వల్ల జరుపుకుంటారు.
◊  ధన్వంతరి ఆరాధన : ఆరోగ్యం, ఆయుర్వేదానికి దేవుడు. క్షీర సముద్ర మథనం సమయంలో అమృతంతో సముద్రం నుంచి ఉద్భవించాడని నమ్ముతారు.
◊  లక్ష్మీదేవి ఆగమనం : లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. లక్ష్మీదేవి అదృష్టాన్ని, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు.
◊  శుభ ప్రారంభాలు: ధన్ తేరాస్ దీపావళి పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. కొత్త పనులు ప్రారంభాలు, పెట్టుబడులు, విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది శుభ సమయంగా పరిగణిస్తారు.
◊  సంపద, శ్రేయస్సును గౌరవించడం : ఈ పండుగ సంపద, శ్రేయస్సు ప్రాముఖ్యతను సూచిస్తుంది. సంపదకు దేవుడు అయిన కుబేరుడు, లక్ష్మీదేవిని గౌరవిస్తుంది.
◊  శుద్ధి, ప్రక్షాళన : దీపావళి పండుగ వేళ వెలుగులు నింపేందుకు, ఆనందంగా గడిపేందుకు సిద్ధమవుతున్న ఇళ్లు, మనస్సులు, ఆత్మలను శుభ్రపర్చడం (శుద్ది చేయడం)తో ధన్తేరాస్ కూడా సంబంధం కలిగి ఉంటుంది.