TTD Chairman : కరోనా నుంచి ప్రజలని కాపాడేందుకు పూజలు, బాధ్యతలు స్వీకరించిన వైవీ

కరోనా కారణంగా...తిరుపతిలో శ్రీవారి దర్శన విషయంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, ప్రజలను ఈ వైరస్ బారి నుంచి కాపాడేందుకు మరిన్ని పూజలు నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

TTD Chairman : కరోనా నుంచి ప్రజలని కాపాడేందుకు పూజలు, బాధ్యతలు స్వీకరించిన వైవీ

Yv

Updated On : August 11, 2021 / 12:59 PM IST

YV Subba Reddy : కరోనా కారణంగా…తిరుపతిలో శ్రీవారి దర్శన విషయంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, ప్రజలను ఈ వైరస్ బారి నుంచి కాపాడేందుకు మరిన్ని పూజలు నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 2021, ఆగస్టు 11వ తేదీ బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రథమ సేవకుడిగా రెండోసారి నియమించడం పట్ల…సీఎం జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం కల్పనకు అనేక చర్యలు తీసుకున్నామని, దురదృష్టవశాత్తు రోనా వల్ల దర్శనాలు క్రమబద్దీకరించాల్సి వచ్చిందన్నారు.

Read More : Dehradun : నా ‘పిలక’ పోయింది సార్..పండిట్ ఫిర్యాదు..కేసు నమోదు

గతంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో..రానున్న రోజుల్లో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తిరుమల కొండపై ప్లాస్టిక్ లేకుండా చేయాలని తాము భావించి..ప్లాస్టిక్ ను విజయవంతంగా బ్యాన్ చేయగలిగామన్నారు. అలాగే…ఏడు కొండల్లో పవిత్రతతను కాపాడాలని, విద్యుత్ వాహనాలను తీసుకరావాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. విద్యుత్ బస్సులు ఏర్పాటుకు ఆర్టీసీ టెండర్లు పిలవడం జరిగినట్లు, రాబోయే రోజుల్లో తిరుపతి నుండి తిరుమలకు వచ్చే భక్తులందరూ విద్యుత్ వాహనాల్లో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Read More :Rajya Sabha : వెంకయ్య నాయుడు కంటతడి, సభ్యుల ప్రవర్తనపై కలత

తిరుమలలోని పచ్చదనాన్ని పవిత్రతను కాపాడడానికి ఇది ఎంతో దోహదపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వామి వారి ప్రసాదాలపై ఆయన స్పందించారు. సహజసిద్ధమైన వ్యవసాయంతో పండించిన ధాన్యాలతో స్వామివారికి నైవేద్యాలు ప్రారంభించామన్నారు. గత వంద రోజులుగా గో ఆధారిత నైవేద్యాన్ని స్వామివారికి దిగ్విజయంగా సమర్పిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో స్వామివారికి గోఆధారిత ఉత్పత్తులతో శాశ్వతంగా నైవేద్యాన్ని సమర్పించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.