టెండూల్కర్ జోస్యాన్ని కోహ్లీ నిజం చేస్తాడా? మొదటి అడ్డు వార్నర్

IPL2020, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad: ప్రతి ఐపీఎల్ సీజన్‌కు ముందు సూపర్ డూపర్ అనిపించుకొని క్లైమాక్స్ లో తుస్సుమనిపించే జట్టు ఏమైనా ఉందంటే అది బెంగుళూరు రాయల్స్. అందరూ స్టార్సే. క్రేజ్‌కు ఢోకా ఉండదు. ఖర్చు ఎక్కువ. ఇంతవరకు ఒక్క ట్రీఫీ గెలవలేదు.
IPL superstarsలందరినీ కుప్పపోసినట్లే ఉంటుంది బెంగుళూరు రాయల్స్. supporters కోట్లలో ఉన్నారు. వాళ్ల కళ్లలో బోల్డంత ఆశ. ఈసారైనా ట్రీఫీ పడతారని. ఇప్పటికి వరకు 12 సీజన్స్‌లో ఆడారు. ట్రీఫీ అందితే ఒట్టు.